Last Updated:

iPhone 16e Discount Offer: బంపర్ ఆఫర్.. రూ. 4,992లకే ఐఫోన్.. బుక్ చేసేయండి బ్రో..!

iPhone 16e Discount Offer: బంపర్ ఆఫర్.. రూ. 4,992లకే ఐఫోన్.. బుక్ చేసేయండి బ్రో..!

iPhone 16e Discount Offer: యాపిల్ గతేడాది తన కొత్త స్మార్ట్‌ఫోన్ iPhone 16 సిరీస్‌ని పరిచయం చేసింది. ఈ సిరీస్‌లోనే SE మోడల్ లైనప్ అయిన మరొక కొత్త iPhone 16eని పరిచయం చేసింది. ఈ సిరీస్‌లో ఇది చౌకైన ఐఫోన్. దీనిలో మీరు AI ఫీచర్లను కూడా చూడచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై ప్రత్యేక తగ్గింపు ఆఫర్‌ను అందిస్తోంది. అయితే ఈ ఫోన్‌లో ఒకే కెమెరా కనిపిస్తుంది. ప్రస్తుతం ఫోన్ ధర రూ.59,900. ఈ ఫోన్‌లో 256జీబీ, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లలో కూడా పరిచయం చేసింది. ఫోన్‌లో అందుబాటులో ఉన్న ప్రత్యేక ఆఫర్‌లను చూద్దాం.

iPhone 16e Offers
యాపిల్ చౌకైన iPhone ప్రస్తుతం ఎటువంటి ఆఫర్ లేకుండా రూ.59,990కి అందుబాటులో ఉంది. అయితే, ఫోన్‌లో కొన్ని EMI, బ్యాంక్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు 12 నెలల నో-కాస్ట్ EMI ఎంపికతో ఫోన్‌ని కొనుగోలు చేయచ్చు. ప్రతి నెలా రూ. 4,992 చెల్లించడం ద్వారా మీరు ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్‌పై UPI చెల్లింపుపై రూ. 2000 తగ్గింపు కూడా అందిస్తారు.

ఇది కాకుండా, మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అదే సమయంలో, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్, కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 4000 తగ్గింపు అందుబాటులో ఉంది, ఇది ధరను మరింత తగ్గిస్తుంది. అలానే ఫోన్‌పై రూ.44,150 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తుంది. అయితే ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ అనేది మీ ఫోన్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.

కంపెనీ ఏదైనా ఫోన్ ఎక్స్ఛేంజ్ విలువపై రూ. 5,000 ప్రత్యేక తగ్గింపును కూడా ఇస్తోంది, తద్వారా మీరు మరింత డబ్బు ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుతం మీరు యాపిల్ iPhone 11 మార్పిడిపై రూ. 18,450 వరకు ఎక్స్ఛేంజ్ విలువను పొందుతారు. ఇందులో రూ. 5,000 అదనపు తగ్గింపు కూడా ఉంది.

iPhone 16e Features
ఐఫోన్ 16eలో 6.1 అంగుళాల OLED డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ ఆపిల్ A18 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. అలానే యాపిల్ ఇంటెలిజెన్స్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. దీనిలో ఒకే 48MP ఫ్యూజన్ వెనుక కెమెరా కూడా ఉంది. వీడియో రికార్డింగ్ కోసం, ఐఫోన్ 16e సెకనుకు 60 ఫ్రేమ్‌ల వద్ద రికార్డ్ చేస్తుంది. ఈ ఫోన్‌ 26 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.