Home / Telangana
తెలంగాణలో సంచలనం సృష్టించిన అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రలోభాల డీల్ కేసులోని నిందితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిలు ముగ్గురు సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు.
మంత్రి జగదీశ్ రెడ్డి పీఏ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో భారీగా నగదు దొరికినట్టుగా వార్తలు వినవస్తున్నాయి. రాత్రి నల్లగొండలోని ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
నవంబర్ 3న జరగనున్న మునుగోడు ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో ప్రత్యేకంగా సమావేశమైనారు.
తెలంగాణలో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేయిలో చేయి వేసి మరీ నడిచి టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ వార్తల్లో నిలిచింది.
2023లో అసెంబ్లీ, 2024లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణాలో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని, తెరాస పార్టీతో పొత్తు ఉండదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు.
ఉప ఎన్నికకు తరలిస్తూ రూ. 89.91లక్షల నగదు హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్సు పోలీసులకు పట్టుబడింది. భాజపా ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వ్యక్తిగత సహాయకుడి డ్రైవర్ తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
తెలంగాణ ప్రజలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరు పాల్గొనాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ప్రభుత్వం సీబీఐ విషయంలో కీలక నిర్ణయం వెల్లడించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రాష్ట్రంలో ఇకపై ఏ కేసులోనైనా దర్యాప్తు చేయాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి తీసుకోవాల్సిందేనంటూ ఆదేశాలు జారీచేసింది.
తెలంగాణాలో రాజకీయ ప్రకపంనలు సృష్టించిన తెరాస పార్టీ ఎమ్మెల్యే కొనుగోల ప్రలోభాల డీల్ కేసులో హైకోర్టు తెరదించింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేంతవరకు దర్యాప్తును కొనసాగించవద్దని సూచించింది.
మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో ఆస్తి పన్ను బకాయిదారులకు ప్రభుత్వం వన్‌టైం సెటిల్మెంట్ స్కీం గడువు రేపటితో ముగియనుంది.