Home / Telangana
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఓ మంత్రే స్వయంగా మద్యం పోశారు. మరోవైపు ప్రధాన పార్టీలు నోట్ల కట్టలను నీళ్లలా పంచారు. దీంతో ఖరీదైన ఉప ఎన్నికగా తెలంగాణాలో మునుగోడు రికార్డుకెక్కింది.
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బెట్టింగ్ ముఠాల తీరు. రేపటిదినం మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈ నెల 6న ఓట్ల లెక్కింపు సాగనుంది. ఈ క్రమంలో పోలింగ్ రౌండ్లను ఓవర్ లెక్కన బుకీలు పంచుకొన్నారు.
రేపటిదినం జరగనున్న మునుగోడు ఉప ఎన్నికకు భారీ పోలీసు బందోబస్తును కల్పించిన్నట్లు రాచకొండ సీపి మహేశ్ భగవత్ పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాల నడుమ పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా తగిన ఏర్పాట్లు చేశామన్నారు.
తెలంగాణలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో తక్కువ మంది విద్యార్ధులు చదువుతున్న పీజీ కోర్సులను రద్దు చేయాలని కళాశాల విద్యాశాఖ నిర్ణయించింది.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్రస్దాయి సమావేశం ఈ నెల 10 న జరగనుంది. ఎన్టీఆర్ భవన్ లో జరిగే ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.
రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులకు 3.9 శాతం డీఏను శాంక్షన్ చేస్తూ మేనేజ్ మెంట్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో అందరిదృష్టిని ఆకర్షిస్తున్న మునుగోడు ఉప ఎన్నికకు రేపు (గురువారం) పోలింగ్ జరగనుంది.
తెలంగాణ ఇంటర్ బోర్డులో ఇంటర్ బోర్డు కార్యదర్శి అధికారాలను వికేంద్రీకరిస్తూ పాలనాపరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.
పాఠశాలలో చిన్నారిపై లైంగిక దాడి నేపధ్యంలో బంజారాహిల్స్ డీఏవీ పాఠశాల గుర్తింపు రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం పునరుద్దదరించింది.
కన్న కొడుకును చంపించేందుకు తల్లిదండ్రులే సుపారీ ఇచ్చిన ఘటన హుజూర్ నగర్ పరిధిలో చోటుచేసుకుంది. వ్యసనాలకు బానిసైన కొడుకు తీరు, ప్రవర్తన పట్ల విసిగిపోయిన ఆ తల్లిదండ్రులు.. ఇలాంటి కొడుకు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అని భావించారో ఏమో కానీ సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించారు.