Published On:

Ayushman Card: ఆయుష్మాన్ కార్డు తీసుకునేటప్పుడు.. ఈ పొరపాట్లు చేయకండి!

Ayushman Card: ఆయుష్మాన్ కార్డు తీసుకునేటప్పుడు.. ఈ పొరపాట్లు చేయకండి!

Ayushman Card: అనారోగ్యానికి గురైనప్పుడు. డాక్టర్ల వద్దకు వెళ్తుంటాం. ఆతర్వాత వారు ఇచ్చే మందుల వల్ల మనం సమస్య నుండి కోలుకుంటాం. కానీ కొన్ని సార్లు వ్యాధుల ప్రభావం తీవ్రమైనప్పుడు హాస్పిటల్లో ఖర్చులు పెరిగిపోతాయి. అంతే కాకుండా మనం ఆర్థికంగా బలహీనంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది.

దీన్ని దృష్టిలో ఉంచుకుని.. భారత ప్రభుత్వం 2018 సంవత్సరంలో ఆయుష్మాన్ కార్డులను తయారు చేయడానికి ఒక పథకాన్ని ప్రారంభించింది. దీనిలో.. అర్హులైన వారికి ఆయుష్మాన్ కార్డులు ఇస్తుంటారు. దీని ద్వారా కార్డు ఉన్న వారు ఉచితంగా చికిత్స పొందవచ్చు. కానీ మీరు ఈ పథకానికి అర్హులు కాకపోతే, పొరపాటున కూడా ఆయుష్మాన్ కార్డును తప్పుడు మార్గంలో తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడతారు. ఒక వేళ మీరు ఆయుష్మాన్ కార్డును తప్పుడు మార్గంలో తయారు చేస్తే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో తెలుసుకుందాం.

ఆయుష్మాన్ కార్డు ఎలా తయారు చేసుకోవాలి ?

ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://pmjay.gov.in/ లోకి లాగిన్ అవ్వాలి.
తర్వాత మీరు ‘AM I Eligible’ ఎంపికపై క్లిక్ చేయాలి.
దీని తరువాత.. మీరు వెబ్ సైట్ లో పూర్తి వివరాను ఫిల్ చేయాలి. ఇలా మీరు ఈ పథకానికి అర్హులో కాదో తెలుసుకోవచ్చు.

ఆయుష్మాన్ కార్డును తప్పుడు డిటైల్స్‌తో అప్లై చేసుకోవచ్చా ?

మొదటి కారణం:
ఈ పథకానికి అర్హులైన వారి కోసం మాత్రమే ఆయుష్మాన్ కార్డులు తయారు చేయబడతాయి. ఆయుష్మాన్ కార్డులను తప్పుడు మార్గంలో తయారు చేస్తే.. అటువంటి వ్యక్తులను గుర్తించి వారి కార్డులను రద్దు చేస్తారు. అంతే కాకుండా జరిమానా విధించే అవకాశం కూడా ఉంటుంది.

రెండవ కారణం:
ఒక వ్యక్తి ఆయుష్మాన్ కార్డును తప్పుడు వివరాలు ఇచ్చి తయారు చేసి.. ఆ కార్డును సద్వినియోగం చేసుకుంటే, అంటే దాని ద్వారా ఉచిత చికిత్స పొందితే ఆ వ్యక్తిని గుర్తించి, అతని ఆయుష్మాన్ కార్డు రద్దు చేయడమే కాకుండా,చికిత్స కోసం ఉపయోగించిన డబ్బును కూడా ఆ శాఖ తిరిగి పొందవచ్చు.

మూడవ కారణం:
మీరు తప్పు ఆయుష్మాన్ కార్డు తయారు చేస్తూ పట్టుబడితే.. శాఖ మీపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. కాబట్టి.. మీరు ఆయుష్మాన్ కార్డును ఎప్పుడూ తప్పుడు మార్గంలో తయారు చేయకూడదు.