Home / latest national news
హీరో విశాల్ నుంచి 7 లక్షలు లంచం తీసుకున్నందుకు గాను గుర్తుతెలియని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ( సిబిఎఫ్‌సి ) ఉద్యోగులు, మరో ముగ్గురు వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసింది.ముగ్గురు నిందితులను మెర్లిన్ మేనగా, జీజా రాందాస్, రాజన్ ఎంలుగా గుర్తించగా, మిగతా వారి పేర్లు వెల్లడించలేదు.
సిక్కింలో సంభవించిన వరదల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. మంగళవారం రాత్రి నుంచి మొదలైన ఈ వరదలు బుధవారం కూడా ఉధృతంగా సాగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాగా ఇప్పటికీ వరదల్లో 14 మంది మరణించగా.. మరో 102 మంది గల్లంతయ్యారు. అదే విధంగా ఈ వరదల్లో 26 మంది గాయపడగా..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమ్ ఆద్మీపార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌ను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్రేట్ అరెస్టు చేసింది. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ అధికారులు బుధవారం ఉదయం నుంచి ఆయన ఇంటిపై దాడులు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలోనే సంజయ్‌సింగ్‌కు అత్యంత సన్నిహితులపై ఈడీ సోదాలు చేసింది.
హాంగ్జౌలో జరిగిన 19వ ఆసియా క్రీడల్లో జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్ చోప్రా 88.88 మీటర్ల త్రోతో తన స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. మరో జావెలిన్ త్రోయర్ కిషోర్ కుమార్ జెనా తన వ్యక్తిగత అత్యుత్తమ 87.54 మీటర్లతో రజత పతకాన్ని సాధించారు.
ప్రపంచ దంతవైద్యుల దినోత్సవం రోజున దంతవైద్యుల దోహదానికి గౌరవ సూచకంగా సెన్సొడైన్ భారత దంతవైద్య సంఘముతో భాగస్వామ్యం కుదుర్చుకొందినోటి ఆరోగ్యం యొక్క పురోగతిలో నగరంలోని అగ్రస్థాయి దంతవైద్యుల దోహదమును గుర్తించడం ద్వారా వారు చేసిన కృషిపై వెలుగు ప్రసరించాలని ఐడిఏ మహాసభ లక్ష్యంగా చేసుకొంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
సీనియర్ నటి కుష్బూ గురించి మనందరికీ తెలిసిందే. అప్పట్లో స్టార్ హీరోలు అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఖుష్బూ టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ సినిమాలలో కూడా నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ
: ఆన్లైన్ బెట్టింగ్ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అక్టోబర్ 6న సమన్లు జారీ చేసింది.ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మూలాల ప్రకారం, రణబీర్ కపూర్ సబ్సిడరీ యాప్‌ను ప్రమోట్ చేసారు.
మహారాష్ట్రలోని ఆసుపత్రుల్లో మరణాల సంఖ్య అకస్మాత్తుగా పెరుగుతూనే ఉంది. నాగ్‌పూర్‌లోని రెండు ప్రభుత్వ ఆసుపత్రుల్లో గడిచిన 24 గంటల్లో 23 మంది రోగులు మరణించారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో మందుల కొరత, వైద్యుల కొరతపైప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మరణాలు సంభవించడం గమనార్హం.
మంగళవారం రాత్రి సిక్కింలోని లాచెన్ లోయలో తీస్తా నదిలో ఒక్కసారిగా వరదలు రావడంతో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.ఉత్తర సిక్కింలోని లొనాక్ సరస్సు వద్ద కుంభవృష్ణి కారణంగా ఈ వరద ఏర్పడింది
దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఢిల్లీతోపాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భూప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీ-ఎన్సీఆర్, పంజాబ్, హర్యానా సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషాల సమయంలో భూమి కంపించింది.