Last Updated:

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఆప్‌ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్‌ అరెస్టు

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఆమ్‌ ఆద్మీపార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్‌ను ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టర్‌రేట్‌ అరెస్టు చేసింది. లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి ఈడీ అధికారులు బుధవారం ఉదయం నుంచి ఆయన ఇంటిపై దాడులు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలోనే సంజయ్‌సింగ్‌కు అత్యంత సన్నిహితులపై ఈడీ సోదాలు చేసింది.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఆప్‌ రాజ్యసభ సభ్యుడు  సంజయ్‌సింగ్‌ అరెస్టు

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఆమ్‌ ఆద్మీపార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్‌ను ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టర్‌రేట్‌ అరెస్టు చేసింది. లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి ఈడీ అధికారులు బుధవారం ఉదయం నుంచి ఆయన ఇంటిపై దాడులు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలోనే సంజయ్‌సింగ్‌కు అత్యంత సన్నిహితులపై ఈడీ సోదాలు చేసింది.

అరోరా ప్రకటనే కీలకంగా..(Delhi Liquor Scam)

ఇదిలా ఉండగా ఆప్‌ నాయకుడు మనీష్‌ సిసోడియాకు అత్యంత సన్నిహితుడు దినేష్ అరోరా, వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవ మాగుంట అప్రూవర్‌గా మారిన తర్వాత సంజయ్‌సింగ్‌ ఇంటిపై దాడులు చేసి..అరెస్టు చేసింది.ఇక అరోరా విషయానికి వస్తే ఈ ఏడాది జులైలో మనీలాండరింగ్‌ కేసు కింద అరెస్టు చేశారు. అయితే సీబీఐ కేసులో ఆయన అప్రూవర్‌గా మారారు. కాగా ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌సిసోడియా అరెస్టులో అరోరా ప్రకటన కీలకపాత్ర పోషించిందని అధికారులు చెబుతున్నారు.

అయితే ఈడీ వర్గాల సమాచారం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దినేష్‌ అరోరా అప్రూర్‌వర్‌గా మారినందుకు సంజయ్‌సింగ్‌ను అరెస్టు చేశారా అని చెప్పలేమన్నారు. దిల్లీ ఎక్సైజ్‌ పాలసీ విధానంలో స్వల్ప మార్పులు చేయడంలో కీలకపాత్ర వహించారు. ముఖ్యంగా డబ్బుకు సంబంధించి అంశాల్లో ఆయన పాత్ర ఉందని ఈడీ వర్గాలు తెలిపాయి. అందుకే ఆయన ఇంట్లో సోదాలు జరపాల్సి వచ్చిందని వివరించారు.