ICC Cricket Team Rankings: భారత్‌కు మరో బిగ్ షాక్.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 9 ఏళ్ల తర్వాత!
ICC Men’s Test Cricket Team Rankings 2025: టీమిండియా మరో బిగ్ షాక్ తగిలింది. ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ మ్యాచ్ సిరీస్‌తో 3-1 తో ఘోర పరాజయంతో ట్రోఫీ కోల్పోయింది. అయితే సిరీస్ కోల్పోయిన టీమిండియాకు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా, ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ మూడో స్థానానికి పడిపోయింది.
ఐసీసీ మెన్స్ క్రికెట్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా 126 రేటింగ్ పాయింట్స్‌తో నంబర్ వన్ ర్యాంకు కైవసం చేసుకుంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా 112 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. టీమిండియా 109 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానం దక్కింది. అయితే దాదాపు 9 ఏళ్ల తర్వాత టీమిండియా మూడో స్థానానికి పడిపోయింది. అంతకుముందు 2016లో ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా మూడో స్థానంలో నిలిచింది. మళ్లీ ఇప్పుడు మూడో స్థానానికి పడిపోవడంతో క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టీమిండియా.. ఇటీవల ఆడిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఘోరంగా విఫలమైంది. 5 టెస్ట్ మ్యాచ్‌లలో ఒక్క మ్యాచ్ మాత్రమే టీమిండియా గెలుపొందగా.. మూడు మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా గెలుపొందింది. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అదే విధంగా పాకిస్థాన్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌ను దక్షిణాఫ్రికా క్లీన్ స్వీప్ చేయడంతో ఆ జట్టు రెండో స్థానానికి ఎగబాకింది. ఇఖ, ఇంగ్లాండ్ 106 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో 96 పాయింట్లతో న్యూజిలాండ్, 87 పాయింట్లతో శ్రీలంక, 83 పాయింట్లతో పాకిస్థాన్, 75 పాయింట్లతో వెస్టిండీస్, 65 పాయింట్లతో బంగ్లాదేశ్, 26 పాయింట్లతో ఐర్లాండ్ జట్లు ఉన్నాయి.