Home / latest national news
ఇజ్రాయెల్ నుండి స్వదేశానికి తిరిగి రావాలనుకునే భారతీయుల కోసం 'ఆపరేషన్ అజయ్' ప్రారంభించినట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేక చార్టర్ విమానాలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నట్లు జైశంకర్ తెలిపారు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో దాదాపు 18,000 మంది భారతీయులు నివసిస్తున్నారని అంచనా.
మహారాష్ట్ర లోని నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల మృత్యుఘోష కొనసాగుతోంది. ఇటీవల ఈ ఆసుపత్రిలో కేవలం 48 గంటల వ్యవధిలోనే 31 మంది మృతిచెందడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. గత ఎనిమిది రోజుల్లో ఈ ఆసుపత్రిలో మరో 108 మరణాలు సంభవించాయి
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల తేదీని సవరించింది ఎన్నికల కమిషన్. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 23న జరగాల్సిన ఎన్నికలు తేదీని సవరించినట్టు భారత ఎన్నికల కమిషన్ బుధవారంనాడు ప్రకటించింది. నవంబర్ 25న ఎన్నికలను నిర్వహించనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ వర్గాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని షెడ్యూల్ ను సవరణ చేసినట్టు పేర్కొంది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ఉదయం పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో నాలుగు చోట్ల రైస్ మిల్లుల్లో సోదాలు నిర్వహించింది. ఉద్యోగాల కుంభకోణంపై కొనసాగుతున్న విచారణకు సంబంధించి ఈ సోదాలు నిర్వహించినట్లు ఒక అధికారి తెలిపారు.
ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సిఆర్ఎ)ని ఉల్లంఘించినందుకు గాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ ) బుధవారం న్యూస్‌క్లిక్ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. ఈ సంస్దపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికారి తెలిపారు.
ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన మెరుపుదాడిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇప్పటికే ఖండించిన విషయం తెలిసిందే. హమాస్ దాడి చేసిందన్న విషయం తెలిసిన కొన్ని గంటల్లోనే ఆయన ట్విటర్ ద్వారా దాడిపై స్పందించారు.
రాజ్యసభ నుంచి తనను సస్పెండ్ చేయడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా సుప్రీంకోర్టులో మంగళవారంనాడు సవాలు చేశారు. సభా హక్కుల ఉల్లంఘన కింద రాఘవ్ చద్దాపై నలుగురు ఎంపీలు ఫిర్యాదు చేయడంతో ఆగస్టు 11న ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది.
కాంగ్రెస్ పార్టీతో మరియు తన పనిలో బిజీగా ఉండటం వలనే తాను పెళ్లి చేసుకోలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. జైపూర్‌లోని మహారాణి కళాశాల విద్యార్థులతో రాహుల్ గాంధీ మాట్లాడిన వీడియోను మంగళవారం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేశారు.
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ బిగ్ రియాలిటీ షో బాస్ కన్నడ హౌస్‌లోకి ప్రవేశించడం వివాదాలు మరియు విమర్శలను రేకెత్తించింది. షో యొక్క 10వ సీజన్ ప్రోమోలో ఈశ్వర్ అభిమానుల కోసం ఇంట్లోకి ప్రవేశించినట్లు చూపబడింది.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ఆయా రాష్ట్రాల్లో కుల గణన చేపట్టేందుకు చర్యలు చేపడతారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతెలిపారు. సోమవారం సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం రాహుల్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కుల గణనకు అనుకూలంగా తాము చారిత్రక నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.