Home / latest ap news
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జిల నియామకం ఖరారైంది. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ధీరజ్ సింగ్ ఠాకూర్, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అలోక్ ఆరాధేలను సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు చేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
గుంటూరులో భారీ చోరీ చోటు చేసుకుంది. కొత్తపేట ఏరియా లోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు ఈ చోరీకి పాల్పడ్డారు. తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు.. 3 కేజీల బంగారం, 5 కేజీల వెండి వస్తువులు, 2 లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లినట్లు తెలుస్తుంది.
వంగవీటి మోహన రంగా.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివాళ్లుండరు. ప్రస్తుతం కొందరు అయితే ఆయన ఓ వర్గానికి బ్రాండ్ అని చెప్తున్నప్పటికి.. అణగారిన వర్గాల కోసం అనునిత్యం ఆయన పోరాడారు.. అందరివాడయ్యారు. ఆయన చనిపోయి 35 ఏళ్ళు గడచినా రంగా పేరు మాత్రం ఏపీలో మారుమోగుతూనే ఉంది.
చిత్తూరు జిల్లాలో ఉన్న దేశంలోనే రెండో అతిపెద్దదైన చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రూ. 385 కోట్లతో చేపడుతున్న ఈ పునరుద్ధరణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజాగా భూమి పూజ చేశారు. ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన మరో
అనకాపల్లిజిల్లా అచ్యుతాపురంలోని సాహితి ఫార్మాలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం గురించి తెలిసిందే. ఈ ఘటన పలువురి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. నిన్న ఉదయం 11.10 నిముషాలకు సాహితీ ఫార్మా యూనిట్-1లో కంటైనర్ నుంచి సాల్వెంట్స్ డంప్ చేస్తుండగా ఒక్కసారిగా ఒత్తిడి పెరగడంతో యార్డులోని
Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా భీమవరంలో గౌడ, శెట్టిబలిజ నాయకులతో పాటు నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. బీసీకులాలు ఏకం కావాలి అని.. రాజ్యాధికారం బీసీలకు రావాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీరాభిమానుల్లో శ్యామ్ ఒకడు. తూర్పు గోదావరి జిల్లాలోని కొప్పిగుంట గ్రామానికి చెందిన శ్యామ్.. విశ్వక్ సేన్ హీరోగా చేసిన "దాస్ కా ధమ్కీ" ప్రీ రిలీజ్ కి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వచ్చినప్పుడు స్టేజ్‌పై సెక్యూరిటీని దాటి మరీ ఎన్టీఆర్ తో ఫోటో దిగాడు. ఆ ఫొటో, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే రెండు రోజుల క్రితం శ్యామ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారని తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ ఉపవాస దీక్షలో ఉన్న కారణంగా.. నీరసంగా ఉండడంతోనే అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది.
గుంటూరు జిల్లాలో కృష్ణా నదీతీరాన ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని తాడేపల్లి సీతానగరంలో నది ఎగువ భాగాన భారీ సంఖ్యలో నాగ ప్రతిమలు బయటపడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అవి ఎక్కడి నుంచి వచ్చాయి..? కూల్చేసిన విగ్రహాలను ఇక్కడ ఎవరైనా వదిలి వెళ్లారా? వంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పలు కారణాలతో విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలను మనం గమనిస్తూ ఉండవచ్చు. క్షణికావేశంలో వారు తీసుకొనే నిర్ణయాల కారణంగా వారి కుటుంబాలు పడే బాధను వర్ణించడం ఎవరికి సాధ్యం కాదు. ఇక ఇటీవల కాలంలో విద్యార్ధుల ఆత్మహత్య ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కర్నూలులో