Last Updated:

Cm Ys Jagan : రూ. 385 కోట్లతో చేపట్టిన చిత్తూరు డెయిరీ పునరుద్దరణ పనులకు భూమి పూజ చేసిన సీఎం జగన్..

చిత్తూరు జిల్లాలో ఉన్న దేశంలోనే రెండో అతిపెద్దదైన చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రూ. 385 కోట్లతో చేపడుతున్న ఈ పునరుద్ధరణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా భూమి పూజ చేశారు. ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన మరో

Cm Ys Jagan : రూ. 385 కోట్లతో చేపట్టిన చిత్తూరు డెయిరీ పునరుద్దరణ పనులకు భూమి పూజ చేసిన సీఎం జగన్..

Cm Ys Jagan : చిత్తూరు జిల్లాలో ఉన్న దేశంలోనే రెండో అతిపెద్దదైన చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రూ. 385 కోట్లతో చేపడుతున్న ఈ పునరుద్ధరణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా భూమి పూజ చేశారు. 2024 ఏప్రిల్‌ నాటికి ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంతో కార్యాచరణ సిద్ధమైంది. తొలి దశలో లక్ష టన్నుల సామర్థ్యంతో మిల్క్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతున్నారు.

ఈ మేరకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో అతిపెద్ద చిత్తూరు డెయిరీ దోపిడీకి గురైందని దుయ్యబట్టారు. ‘‘చిత్తూరు డెయిరీపై చంద్రబాబు కళ్లు పడ్డాయి. చంద్రబాబు  హయాంలో అన్యాయంగా చిత్తూరు డెయిరీని మూసేశారు. చిత్తూరు డెయిరీ నష్టాల్లో ఉంటే హెరిటేజ్‌ డెయిరీ లాభాల్లోకి వెళ్లడం ఆశ్చర్యమేసింది. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం హామీ నెరవేర్చా. 182 కోట్ల బకాయిలను తీర్చి డెయిరీ రీఒపెన్‌ చేస్తున్నాం. అమూల్‌ రూ.325 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది’’ అని సీఎం పేర్కొన్నారు. తోడేళ్లు అన్నీ ఏకమవుతున్నాయి. విష ప్రచారాన్ని నమ్మకండి. దత్తపుత్రుడి కలిసి చంద్రబాబు అభివృద్థి, సంక్షేమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు వెన్నుపోటు వీరుడు.. అంటూ విమర్శలు చేశారు.

ఈ యూనిట్‌ ద్వారా పాలు, పెరుగు, వెన్న, పన్నీర్, మజ్జిగను ఉత్పత్తి చేయనున్నారు. మలిదశలో రూ. 150 కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఐస్‌క్రీం ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత దశల వారీగా పాల కర్మాగారం, వెన్న, పాలపొడి, చీజ్, పన్నీర్, యోగర్ట్, స్వీట్లు తయారీ విభాగాలతో పాటు అల్ట్రా హై ట్రీట్‌మెంట్‌ (యూహెచ్‌టీ) ప్లాంటు ఏర్పాటు చేయనున్నారు. ఈ డెయిరీ పునరుద్ధరణ ద్వారా ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే 25 లక్షల మంది పాడి రైతులకు లబ్ధి చేకూరనుంది. మధ్యాహ్నం 1.05 గంటలకు సీఎంసీ ఆసుపత్రి ఆవరణలో 300 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.