Home / latest ap news
ఈ ముఖ్యమంత్రి ఆ నాడు ప్రతిపక్షంలో ఉండి అమరావతికి మరో ఐదువేల ఎకరాలు కావాలని చెప్పి ఇపుడు మూడు రాజధానులని నాటకాలు ఆడుతున్నాడంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వారాహి యాత్రలో భాగంగా బుధవారం రాత్రి కత్తిపూడి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ అమరావతిపై యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు.
ఈ సారి అసెంబ్లీలోకి నన్ను ఎవడు అడుగు పెట్టనీయడో నేను చూస్తాను.. అసెంబ్లీలోకి జనసేన అడుగుపెడుతుంది అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలెంజ్ చేసారు. బుధవారం రాత్రి కత్తిపూడి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈ ముఖ్యమంత్రికి చాలెంజ్ చేస్తున్నాను. వైసీపిని పడదోస్తాము. కూలదోస్తామని స్పష్టం చేసారు
ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలను ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా విడుదల చేశారు. జేఎన్టీయూ అనంతపురం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సెట్‌ను గత నెల 15 నుంచి 24 వరకు నిర్వహించారు. వీటిలో భాగంగా ఏపీలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ అడ్మిషన్లను భర్తీ చేయనున్నారు. ఈ పరీక్షలకు తెలుగు రాష్ట్రాల నుంచి
ప్రస్తుతం దేశంలో వరుస రైలు ప్రమాదాలు చోటు చేసుకోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. తాజాగా ఏపీలోని అనకాపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు.. తాడి-అనకాపల్లి స్టేషన్ల మధ్య తెల్లవారుజామున 3.35 గంటలకు పట్టాలు తప్పింది. దీంతో విశాఖపట్నం-విజయవాడ మార్గంలో పలు రైళ్ల
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై 55 అభియోగాలతో కూడిన ప్రజా చార్జ్ షీట్ ను కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరి రామ జోగయ్య విడుదల చేశారు. జగన్ ప్రభుత్వాన్ని మరోసారి కొనసాగించాలా? వద్దా? అని ఛార్జ్ షీట్ ద్వారా ప్రజలను ప్రశ్నించారు.
తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలవ్వగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో చిన్నారి సహా ఇద్దరు మహిళలు కూడా ఉండగా.. మృతులు అంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలియటంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.
సెక్షన్ 30 యాక్ట్‌ని ప్రభుత్వం అమలు చేయడంతో యాత్ర ఏ విధంగా నిర్వహించాలన్నఅంశంపై చర్చించనున్నారు.రేపు జనసేన పార్టీ కార్యాలయంలో నూతన భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తరువాత పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శాంతి హోమం ప్రారంభం అవుతుంది.
విజయవాడలో వైకాపా ఎమ్మెల్సీ మహ్మద్ రుహుల్లా కారు బీభత్సం సృష్టించింది. స్థానిక బీఆర్టీఎస్ రోడ్ లో అర్ధరాత్రి 2:30 గంటలకు ఎమ్మెల్సీ కారు.. బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న గుణదల పోలీసులు వెంటనే ప్రమాదస్థలికి
టాలీవుడ్ లో ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో తమ ఫైట్స్ తో ప్రేక్షకులను అలరించారు ఈ సోదరులు. అయితే తాజాగా ఈ అన్నదమ్ములు రీసెంట్ గా చేసిన ఒక పని అందర్నీ ఆకట్టుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ లోని చీరాలలో జోళి పట్టి బిక్షాటన చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనంగా మారిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని ఎనిమిదో నిందితుడుగా చేర్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.