Last Updated:

Crime News : గుంటూరులో భారీ చోరీ.. 3 కేజీల బంగారం, 5 కేజీల వెండి, 2 లక్షల నగదు మాయం

గుంటూరులో భారీ చోరీ చోటు చేసుకుంది. కొత్తపేట ఏరియా లోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు ఈ చోరీకి పాల్పడ్డారు. తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు.. 3 కేజీల బంగారం, 5 కేజీల వెండి వస్తువులు, 2 లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లినట్లు తెలుస్తుంది.

Crime News : గుంటూరులో భారీ చోరీ.. 3 కేజీల బంగారం, 5 కేజీల వెండి, 2 లక్షల నగదు మాయం

Crime News : గుంటూరులో భారీ చోరీ చోటు చేసుకుంది. కొత్తపేట ఏరియా లోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు ఈ చోరీకి పాల్పడ్డారు. తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు.. 3 కేజీల బంగారం, 5 కేజీల వెండి వస్తువులు, 2 లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లినట్లు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

స్థానికంగా నివసిస్తున్న నరసింహారావు కుటుంబం.. బుధవారం నాడు అతని కొడుకు వైజాగ్ వెళ్ళేందుకు సిద్దమయ్యాడు. దీంతో అతన్ని వందేభారత్ ట్రెన్ ఎక్కించేందుకు కుటుంబ సభ్యులు అంతా విజయవాడ వెళ్ళారు. దాంతో నటలో ఎవరూ లేరనే విషయాన్ని పసిగట్టిన దుండగులు.. ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించాడు. అనంతరం బీరువాని కుడ్డ పగులగొట్టి.. అందులోని మూడు కేజీల బంగారు ఆభరణాలు, రెండు కేజీల వెండి ఆభరణాలు, రెండు లక్షల రూపాయల నగదు తీసుకొని కిందకు వచ్చాడు. అదే సమయంలో కింద ఉన్న వాళ్ళు ఎవరని ప్రశ్నించగా పై ఇంటికొచ్చామని చెప్పుకుంటూ వెళ్ళి పోయాడు. విజయవాడ నుండి తిరిగి వచ్చిన నరసింహారావు కుటుంబం తలుపు తీసి ఉండటంతో హడావుడిగా లోపలికి వెళ్ళారు. అప్పటికే దొంగలు పడినట్లు గుర్తించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

theft

బ్యాంక్ లాకర్ కేటాయించడంలో జాప్యం జరిగిన కారణంగానే.. అంత విలువైన ఆభరణాలు ఇంటిలో పెట్టినట్లు బాధితులు వాపోతున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వ్యవధిలో దొంగతనం జరిగినట్టు గుర్తించారు. రద్దీగా ఉండే ప్రాంతం.. అది కూడా పోలీసు స్టేషన్ కు దగ్గర ఉన్న ప్రాంతంలో చోరీ జరగడంతో పోలీసులు కూడా షాక్ అవుతున్నారు.