Home / latest ap news
శ్రీకాళహస్తి ఘటనపై రాష్ట్ర మానవహక్కుల సంఘం సీరియస్ అయ్యింది. జనసేన నాయకుడిపై సిఐ అంజూయాదవ్ చేయి చేసుకున్న ఘటనపై హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాలో వచ్చిన కధనాలను.. సుమోటోగా తీసుకుని హ్యూమన్ రైట్స్ కమిషన్ కేసు నమోదు చేసింది. ఈనెల 27లోగా వివరణ ఇవ్వాలని సిఐ అంజూయాదవ్.. డిఎస్పీ, ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది.
థాయ్ లాండ్ లో జరుగుతున్న 25వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2023 లో తెలుగు క్రీడాకారులు అదరగొడుతున్నారు. అద్భుత ప్రదర్శనతో ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 2023 లో బంగారు పతకం సాధించింది వైజాగ్ అమ్మాయి "జ్యోతి యర్రాజు". ఈ మేరకు ఆ క్రీడాకారిణికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ను జగన్ అనే జలగ పట్టి పీడిస్తోందని జనసేన అధినేతన పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం సాయంత్రం ఆయన తణుకు నియోజకవర్గం నాయకులు, వీర మహిళలతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ అవినీతి, అరాచకాన్ని జగన్ తారాస్థాయికి తీసుకెళ్లారని ఆరోపించారు. ఒక కులం పార్టీని, సమాజాన్ని నడపలేదని దోచుకునే వాళ్లకే కాదు అందిరికీ హక్కులున్నాయని అన్నారు.
తెలంగాణ విద్యావ్యవస్థపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని విద్యావ్యవస్థను తెలంగాణతో పోల్చడం సరికాదని, రోజూ అనేక కథనాలు, కుంభకోణాలు కనిపిస్తున్నాయన్నారు. టీచర్లను కూడా బదిలీ చేయలేని దుస్థితి తెలంగాణది. మన విధానం మనది.. మన ఆలోచనలు మనవి అని బొత్స వ్యాఖ్యానించారు.
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జిల్లాలోని దర్శి దగ్గర సాగర్ కెనాల్ లో అదుపుతప్పి పెళ్లి బృందం బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. మరో 30 మందికి గాయాలయ్యాయి. పొదిలి నుంచి కాకినాడకు వివాహ రిసెప్షన్ కోసం వెళుతుండగా
ఏపీలో తాజాగా మరోమారు కరెంటు బిల్లు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఓ చిన్న పూరిగుడిసెకి.. విద్యుత్ శాఖ అధికారులు బిల్లు రూపంలో కరెంట్ షాక్ ఇచ్చారు. దాదాపు మూడున్నర లక్షల కరెంటు బిల్లు వేయడంతో ఆ గుడిసెలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ ఏం చేయాలో పాలుపోని స్థితిలో
జనసేనాని పవన్ కళ్యాణ్.. ఆయన సతీమణి అన్నా లెజ్నెవా విడిపోయారంటూ ఇటీవల తప్పుడు వార్తలు ఎక్కువగా ప్రచారం అయిన విషయం తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ తీవ్రంగా స్పందించింది. అలానే పవన్ వ్యక్తిగత జీవితంపై తప్పుడు కథనాలు, అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని
ఏపీలోని నరసరావుపేటలో ఓ దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఇంటిని ఓ మహిళకు అద్దెకు ఇస్తే.. అందులో వ్యభిచారం నిర్వహిస్తోందని.. మట్కావ్యాపారితో అక్రమ సంబంధం పెట్టుకుని ఇంటిని కబ్జా చేశారని.. అతను రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో పోలీసులు చర్యకు వెనుకాడుతున్నారని.. ఖాళీ చేయమంటే
ఏపీ సీఎం జగన్ తాజాగా చేసిన ఢిల్లీ పర్యటనపై ఎప్పటిలాగే అనేక రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైసీపీ నేతలు ఎప్పటిలాగే జగన్ రాష్ట్రం కోసమే వెళ్లారంటూ భజన చేస్తుండగా.. ఏం జరిగింది అనే విషయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పర్యటనలో భాగంగా జగన్ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మల
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో దారుణ ఘటన జరిగింది. ఆస్తి కోసం సొంత కుటుంబ సభ్యులనే ఓ వ్యక్తి అతి కిరాతకంగా చంపడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. పొలంలో సగ భాగం రాసివ్వాలని తన పిన్ని, సోదరుడు, సోదరిని దారుణంగా చంపాడు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.