Home / latest ap news
ప్రముఖ హీరో సూర్య పుట్టిన రోజు పురస్కరించుకొని తమిళనాట అభిమానులు నెక్స్ట్ లెవెల్లో సెలబ్రేషన్స్ చేస్తున్నారు. కాగా సూర్యకి తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ మేరకు ఏపీలో సూర్య బర్త్ డే ని సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేసిన అభిమానులు ఊహించని రీతిలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.
వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో ట్వీట్ చేశారు. ఏపీ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలపై విరుచుపడుతున్న జనసేనాని ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. వీటికి సరైన సమాధానం చెప్పలేని ప్రభుత్వ పెద్దలు పవన్ పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఏపీలో డీఎస్సీ, బైజూస్ ట్యాబ్ లపై ట్విట్టర్ వేదికగా సర్కార్ ను నిలదీసారు.
వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె సునీత సీబీఐకి కీలక విషయాలు వెల్లడించింది. వివేకా హత్య కేసు ఛార్జిషీట్‌తోపాటు సునీత ఇచ్చిన వాంగ్మూలాలని సునీత వాంగ్మూలాలను సిబిఐ కోర్టుకు సమర్పించింది. ఇంటికొచ్చి కలుస్తానంటూ 2019 మార్చి 22న వైఎస్ భారతి ఫోన్ చేశారు సునీత చెప్పారు
వైఎస్ వివేకా హత్య కేసులో గతనెల 30న ఛార్జిషీటు సమర్పించిన సీబీఐ వైఎస్ షర్మిల వాంగ్మూలాన్ని కీలకంగా ప్రస్తావించింది. షర్మిల వాంగ్మూలాన్ని చార్జిషీటులో పొందు పరిచింది. గతేడాది అక్టోబర్ 7న షర్మిల ఢిల్లీలో 29వ సాక్షిగా సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు.
ఏపీ ప్రజలకి సంబంధించిన అన్ని వివరాలు సేకరిస్తున్న డేటాపై ప్రభుత్వం తక్షణమే వివరణ ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. తన ట్వీట్‌కి ఓ వీడియోని కూడా ఆయన జత చేశారు. త్వరలో రాష్ట్రమంతా ఉద్యమంలా ప్రజలు వైఎస్ఆర్సిపిపై తిరుగుబాటు మొదలు పెడతారు సిద్ధంగా ఉండు జగన్ అంటూ జనసేన శతఘ్ని టీం హెచ్చరించింది.
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నేతన్న నేస్తం నిధులు విడుదల చేసిన సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్, లోకేష్, బాలకృష్ణపై తీవ్ర విమర్శలు చేశారు. మంచి చేస్తున్న వ్యవస్థలను కొంతమంది విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సీబీఐ చార్జిషీట్లో ప్రస్తావించిన కీలక అంశాలు బయటికి వచ్చాయి. హత్యకు కుట్ర చేశారని, ఘటనాస్థలంలో ఆధారాలు చెరిపేశారని సీబీఐ తెలిపింది. ఫొటోలు, గూగుల్ టేక్ అవుట్, లొకేషన్ డేటాను సీబీఐ కోర్టుకు సమర్పించింది. వివేకా హత్యకు అవినాష్, భాస్కర్‌రెడ్డి కుట్ర చేశారని సీబీఐ నిర్థారించింది.
భారీ వర్షాలతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అల్లకల్లోలమవుతోంది. అల్లూరిజిల్లాలో గోదావరి, శబరి నదులకి వచ్చిన వరదలతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. విలీన మండలాలకి అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చేరుకున్నారు. కూనవరం, విఆర్ పురం మండలాల్లో కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యటించారు.
ఏపీ రాజకీయాలపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరి రామ జోగయ్య సంచలన విశ్లేషణ చేశారు. ఎన్‌డిఎ మిత్ర పక్షాల ఆత్మీయ సమావేశానికి పవన్ కళ్యాణ్‌ని పిలవడమంటే తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఆయన చరిష్మాని ఉపయోగించడం ద్వారా లబ్ధి పొందాలనేదే ధ్యేయంగా కనిపిస్తోందని జోగయ్య అంచనా వేశారు.
జనసేన కార్యకర్తలకు అండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో పర్యటించారు. శ్రీకాళహస్తి ఘటనపై ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. సీఐ అంజూ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. జనసేన కార్యకర్తలు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే సీఐ చేయిచేసుకున్నారని పవన్ తెలిపారు.