Home / latest ap news
తెలుగు రాష్ట్రాలకు మళ్ళీ రెయిన్ అలర్ట్ వచ్చింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో పలు చోట్ల ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలవైపు కేంద్రీకృతమైందని వాతావరణ వెల్లడించింది. ఈ అల్పపీడనానికి నైరుతి రుతుపవనాలు తోడవడంతో
టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట దక్కలేదు. సిఐడి తరపు న్యాయవాదుల వాదనలతో ఏపీ హైకోర్టు ఏకీభవించి పిటిషన్ ను కొట్టేసింది.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిందితుడిగా ఉన్న స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై పార్లమెంట్ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని పిల్ వేశారు.
కుల, మతాలకు అతీతంగా దైవ సన్నిధిలో ఎవరైనా సరే.. భయ భక్తులతో ఉంటుంటారు. అయితే అటువంటి చోటే ప్రజలకు రక్షణ కల్పిస్తూ.. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వారే నిబంధనలను అతీతంగా చేస్తే.. అతిక్రమించి పేకాట ఆడటం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన పవిత్రమైన
విజయదశమినుంచి విశాఖనుంచే ప్రభుత్వ పాలన సాగుతుందని ఏపీ సిఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. గురువారం జరిగిన కేబినేట్ భేటీలో సీఎం జగన్ ఈ విషయాన్ని స్పష్టం చేసారు. దసరా పండుగ విశాఖలోనే జరుపుకుందామని.. ప్రస్తుతానికి సిఎంఓ తరలిస్తామని మంత్రులకి జగన్ చెప్పారు.
రాయలసీమ నీటి కష్టాలు తనకు తెలుసని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. మంగళవారం కర్నూలు జిల్లాలోని 77 చెరువులకు నీరందించే హంద్రీనివా ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరువు జిల్లాను సస్యశ్యామలం చేయడానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మెడకి మరో కేసు చుట్టుకుంది. ఏపీ ఫైబర్ నెట్ కేసులో సిఐడి పోలీసులు చంద్రబాబుని నిందితుడిగా పేర్కొంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి అధికారులు పిటి వారెంట్ దాఖలు చేశారు.
భారతదేశంలోని టాయ్-ట్రైన్-నేపథ్య రెస్టారెంట్ అయిన ప్లాట్ఫామ్ 65 తన అన్ని అవుట్లెట్లెలో గణేష్ చతుర్థి ప్రత్యేకమైన వేడుక నిర్వహించడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది. అదే సమయంలో తన సామాజిక బాధ్యతను నెర వేర్చడానికి నడుం బిగించింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన వాటి కంటే ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలను ప్రోత్సహిస్తుంది.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోలీస్ రిక్రూట్ మెంట్ లో విషాదం చోటు చేసుకుంది. గుంటూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న ఎస్సై అభ్యర్థుల ఫిజికల్ టెస్ట్ లో పాల్గొన్న యువకుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మైదానంలో కుప్పకూలిన అతడిని హాస్నిటల్ కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. విజయనగరం మెడికల్ కాలేజీ ప్రాంగణం నుంచి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను సీఎం జగన్ వర్చువల్గా ప్రారంభించారు