Home / latest ap news
దేశ వ్యాప్తంగా రోజురోజుకీ నేరాలు ఎక్కువ అవుతున్నాయి.. తప్ప తగ్గడం లేదని సామాన్య ప్రజలు అంతా భావిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటీవల కాలంలో నేర పూరిత ఘటనలు ఎక్కువయ్యాయని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా గత కొన్ని రోజులుగా చిన్నారుల కిడ్నాప్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా తిరుపతి
వారాహి విజయ యాత్ర అనేది అట్టర్ ఫ్లాప్ అయిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ వెంట ఉన్నది జనసైనికులు కాదని.. సైకిల్ సైనికులని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ నిజంగా నిజాయితీ పరుడు అయితే.. అవినీతి పరుడైన చంద్రబాబుకు ఎందుకు సపోర్ట్ చేశారని ప్రశ్నించారు.
అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నలపాలెంలోని మాజీ మంత్రి , టీడీపీ సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి వద్ద అర్థరాత్రి 11 గంటల తరువాత తీవ్ర ఉద్రికత్త చోటుచేసుకుంది. భారీగా పోలీసులు వారింటివద్ద మోహరించారు. బండారు సత్యనారాయణ మూర్తికి 41 ఏ నోటీసులు ఇచ్చి అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 60 చోట్ల ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. ఏపీలో 40 చోట్ల, తెలంగాణాలో 20 చోట్ల అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టులకు నిధులు సమకూరుస్తున్నారన్న సమాచారంతో ఎన్ ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తరువాత వచ్చేది జనసేన - తెలుగుదేశం ప్రభుత్వమేని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వారాహి నాల్గవ విడత యాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం అవనిగడ్డ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. నాలుగో విడత వారాహి యాత్ర నేటి నుంచి ప్రారంభించనున్నారు. కృష్ణా జిల్లా నుంచి ఈ యాత్ర షురూ కానుంది. మూడు విడతలు విజయవంతం కాగా ఈ విడతను కూడా సక్సెస్ చేయాలని జనసేన పార్టీ భావిస్తోంది. యాత్రను విజయవంతం చేసేందుకు జనసేన సమన్వయకర్తలను కూడా నియమించింది.
జనసేనాని పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి విజయ యాత్ర కృష్ణా జిల్లాలో అవనిగడ్డ బహిరంగ సభతో ప్రారంభం కానుంది. అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు అవనిగడ్డలోని శ్రీ యక్కటి దివాకర్ వీణాదేవి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో బహిరంగ సభ జరగనుంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర మరోసారి వాయిదా పడింది. అక్టోబర్ 3వ తేదీన సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసుకి సంబంధించిన వాదనలు జరుగనున్నాయి. ఢిల్లీలో లాయర్లతో నారా లోకేష్ సంప్రదింపులు జరపాల్సి ఉంది.
భరత జాతి చైతన్యమూర్తి భగత్ సింగ్ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. భరత జాతిలో పోరాట స్ఫూర్తిని రగిలించిన యోధుడు షహీద్ భగత్ సింగ్‌ను ఆసేతు హిమాచలం గుండెల్లో పెట్టుకుందన్నారు. తెల్లవారి దాష్టీకాలను ఎదిరించిన ఆ వీరుని జయంతి సందర్భంగా సభక్తికంగా అంజలి ఘటిస్తున్నానని పవన్ తెలిపారు.
ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్‌పై హోంమంత్రి అమిత్ షాకు టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫిర్యాదు చేశారు. సిఐడి చీఫ్ సంజయ్ సర్వీస్ రూల్స్ అన్నీ ఉల్లంఘించారంటూ ఆధారాలు సమర్పించారు. సర్వీస్ రూల్స్ అతిక్రమించి సిఐడి చీఫ్ సంజయ్ వైసీపీకి తొత్తుగా పనిచేస్తున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.