Home / latest ap news
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీనితో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. ఈ నెల 22 వరకూ చంద్రబాబు రిమాండ్ లో ఉంటారు.
పోలీసు సెక్యూరిటీ నడుమ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసుల యంత్రాంగం దగ్గరుండి కార్యాలయానికి చేర్చారు. దారంతా జనసైనికులు రక్షణ వలయంగా వెంట సాగారు. మంగళగిరికి వెళ్లాలని బయల్దేరిన జనసేనానిని జగ్గయ్యపేటలోని గరికపాడు దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబుని విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ హాజరుపర్చింది.. ఈ కేసులో వాదనలు కొనసాగుతున్నాయి. కోర్టులో సీఐడీ తరఫున ఏఏజీ సుధాకర్‌రెడ్డి, చంద్రబాబు తరపున లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు
ఉంగరం కొనడానికి అని మామూలుగానే జ్యుయలరీ షాప్ కు వచ్చిన దొంగ ఓనర్ ఉండగానే దాదాపు రూ.4 లక్షల విలువచేసే బంగారాన్ని దోచుకెళ్లిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లిలో స్వాతి జ్యూయలరీస్ షాప్ లో బంగారం కొనడానికి ఓ వ్యక్తి వచ్చాడు.
చిత్తూరు జిల్లాలో తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వడమాలపేట చెక్ పోస్టు దగ్గర ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోగా.. అదే మార్గంలో వస్తున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. చిత్తూరు నుంచి బైక్‌పై వెళ్తున్న ముగ్గురు రోడ్డుపై అడ్డంగా ఉన్న
ప్రస్తుత కాలంలో ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువే జరుగుతున్నాయి. ప్రేమ కోసం దేశాలు దాటి మరీ వెళ్ళి పెళ్లి చేసుకుంటున్న ఘటనలను గమనించవచ్చు. అయితే ప్రేమకి నో చెబుతూ పలు నేరాలకు దారి తీసిన ఘటనలు కూడా కోకొల్లలు ఉన్నాయి. కానీ ఇప్పుడు తాజాగా ఏపీలో చోటు చేసుకున్న ఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు చేపట్టింది. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆప్ ఇండియా ( పీఎఫ్ఐ)కు చెందిన యూనస్‌ను మూడు నెలల క్రితం ఎన్ఐఏ అధికారారులు అరెస్ట్ చేసిన వసిహాయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా స్థానికంగా నివసిస్తున్న యూనస్ అత్తమ్మ ఇంట్లో ఎన్ఐఏ ఎస్పీ
తిరుమల అలిపిరి నడకమార్గంలో అటవీశాఖ అధికారులు తాజాగా ఐదో చిరుతను పట్టుకున్నారు. నరసింహస్వామి ఆలయం, ఏడవ మైలు రాయి మధ్యలో చిరుత చిక్కినట్లు సమాచారం అందుతుంది. నాలుగు రోజుల క్రితమే చిరుత కోసం బోన్లు ఏర్పాటు చేశారు. దీంతో ఆపరేషన్ చిరుత విజయవంతం అయినట్టు అధికారులు చెబుతున్నారు.
16 సంవత్సరాల తరువాత ఇబ్రహీంపట్నం బిఫార్మసీ విద్యార్థిని ఆయేషామీరా హత్య కేసు మళ్ళీ మొదటికి వచ్చింది. ఈ కేసులో పోలీసులకి రిపోర్టు ఇచ్చిన పూసపాటి వెంకట కృష్ణప్రసాద్‌ని విచారణకి హాజరు కావాలని సీబీఐ అధికారులు నోటీసులిచ్చారు.
ఏపీలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం సృష్టించాయి. గన్నవరం విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు బెదిరింపు కాల్ రావడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు పోలీసులతో పాటు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ కు సమాచారం అందించారు. ప్రయాణికులను బయటకు పంపించి