Last Updated:

Apple iPhone SE 4: చీప్ వేరీ చీప్.. బడ్జెట్ ఐఫోన్ SE 4.. ఫీచర్లు వరం లాంటివి..!

Apple iPhone SE 4: చీప్ వేరీ చీప్.. బడ్జెట్ ఐఫోన్ SE 4.. ఫీచర్లు వరం లాంటివి..!

Apple iPhone SE 4:  iPhoneని చౌకగా కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త ఉంది. మార్క్ గుర్మాన్ తన ఇటీవలి నివేదికలో ఆపిల్ ఏప్రిల్ నాటికి 4వ GEN ఐఫోన్ SEని పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ టైమ్ లైన్ కంపెనీ మునుపటి లాంచ్‌ల మాదిరిగానే కనిపిస్తోంది. ఐఫోన్ SE  మునుపటి మోడల్‌లు మార్చి లేదా ఏప్రిల్‌లో విడుదల చేశారు. కొత్త మోడల్ ఇప్పటికే ఉన్న iPhone SE (2022) స్థానంలో ఉంటుంది. అంటే దాదాపు 3 సంవత్సరాల తర్వాత కొత్త SE స్మార్ట్‌ఫోన్లు వస్తున్నాయి. అయితే, ఈసారి iPhone SE 4 కొత్త రూపాన్ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. దీన్ని iPhone 14 ఆధారంగా రూపొందించనున్నారు.

బ్లూమ్‌బెర్గ్ రిపోర్టర్ మార్క్ గుర్మాన్ తన ఇటీవలి నివేదికలో రిటైల్ అవుట్‌లెట్‌లలో ఇప్పటికే ఉన్న iPhone SE (2022) ఇన్వెంటరీ తగ్గిపోతోందని, ఇది త్వరలో కొత్తగా విడుదల కావచ్చని చూపిస్తుంది. “తక్కువ ఇన్వెంటరీ అనేది కొత్త మోడల్ రాబోతోందనడానికి సంకేతం, అయితే ఇది ఆపిల్ బహుశా ఇప్పటికే ఉన్న తక్కువ ధర వద్ద ఉంచదని కూడా సూచిస్తుంది.

చివరిసారిగా iPhone SE (2022) ధర $429 అంటే సుమారు రూ. 37,000 అయితే రాబోయే iPhone SE 4 దాని మెరుగైన ఫీచర్లను పరిగణనలోకి తీసుకుని మునుపటి మోడల్ కంటే ఎక్కువగా ఉంటుంది. కొత్త ఐఫోన్ SE లాంచ్ ఏప్రిల్ చివరి నాటికి జరగవచ్చని ఇంతకుముందు చెప్పారు. అయితే దీని ధర $500 కంటే తక్కువ అంటే సుమారు రూ.42,000 ఉండే అవకాశం ఉంది.

iPhone SE 4 Specifications
ఈసారి ఆపిల్ iPhone SEని iPhone 16Eగా కూడా ప్రవేశపెట్టవచ్చు. Apple ఇంటెలిజెన్స్ ఫీచర్‌ల సపోర్ట్‌తో ఈఫోన్ A18 చిప్‌ని కలిగి ఉండే అవకాశం ఉంది. హ్యాండ్‌సెట్ ఐఫోన్ 14ని పోలి ఉండవచ్చు. ఇది 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.06-అంగుళాల ఫుల్-HD+ LTPS OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

ఫోన్‌లో ఫేస్ ఐడి సపోర్ట్ అందుబాటులో ఉండవచ్చు కానీ దానికి ఫిజికల్ హోమ్ బటన్ ఉండదు. స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్‌‌తో వస్తుందని చెబుతున్నారు. ఇది అల్యూమినియం ఫ్రేమ్, USB టైప్-సి పోర్ట్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది మాత్రమే కాదు, ఫోన్ 48 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరాను కలిగి ఉంటుంది.