Last Updated:

CM YS Jagan: రాయలసీమ నీటి కష్టాలు నాకు తెలుసు..ఏపీ సీఎం వైఎస్ జగన్

రాయలసీమ నీటి కష్టాలు తనకు తెలుసని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. మంగళవారం కర్నూలు జిల్లాలోని  77 చెరువులకు నీరందించే హంద్రీనివా ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరువు జిల్లాను సస్యశ్యామలం చేయడానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు.

CM YS Jagan: రాయలసీమ నీటి కష్టాలు నాకు తెలుసు..ఏపీ సీఎం వైఎస్ జగన్

CM YS Jagan: రాయలసీమ నీటి కష్టాలు తనకు తెలుసని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. మంగళవారం కర్నూలు జిల్లాలోని  77 చెరువులకు నీరందించే హంద్రీనీవా ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరువు జిల్లాను సస్యశ్యామలం చేయడానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు.

రూ.13 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు..(CM YS Jagan)

చంద్రబాబులా. ఎన్నికలకు నాలుగు నెలల ముందు హామీలిచ్చే వ్యక్తిని కానని.. ఇచ్చిన మాటపై నిలబడతానని అన్నారు. ఈ ప్రాజెక్టును 250 కోట్లతో ప్రారంభించామన్నారు. చంద్రబాబు హయాంలో హంద్రీనీవాకు కేవలం రూ.13 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం ఎన్నికలకు 4 నెలల ముందు ఒక జీవో ఇచ్చింది.ప్రాజెక్టు కోసం భూములు సేకరించలేదు కానీ టెంకాయ కొట్టడానికి 8 ఎకరాలు కొన్నాదని ఆక్షేపించారు. వైఎస్సార్ సీఎంగా ఉన్నపుడు హంద్రీ నీవా కాలువను 6 వేల కోట్లతో నిర్మించారని దీనితో తూములను ఏర్పాటు చేసుకుని చెరువులను నీళ్లతో నింపుతున్నామన్నారు. మనం అధికారంలోకి వచ్చాక 4 ఏళ్లల్లో ప్రాజెక్టును పూర్తి చేసుకున్నాం.ఈ ప్రాజెక్టుతో డోన్, పత్తికొండ నియోజకవర్గాలకు మంచి జరుగుతుంది.రూ.250 కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టు నిర్మించామని జగన్ చెప్పారు.

గాజులదిన్నె ప్రాజెక్టుతో 24 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఈ ప్రాజెక్టుకు కృష్ణా జలాల కేటాయింపులు లేవని,కేవలం వర్షం నీరే దిక్కని జగన్ అన్నారు.అధికారంలోకి వచ్చాక గాజులదిన్నె ప్రాజెక్టుకు గ్రావిటీ ద్వారా నీళ్లు తెచ్చామని తెలిపారు.గాజులదిన్నె ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచుకున్నామని ఈ విధంగా పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు.