Last Updated:

Rain Alert : తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లోనే !

తెలుగు రాష్ట్రాలకు మళ్ళీ రెయిన్ అలర్ట్ వచ్చింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో పలు చోట్ల ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలవైపు కేంద్రీకృతమైందని వాతావరణ వెల్లడించింది. ఈ అల్పపీడనానికి నైరుతి రుతుపవనాలు తోడవడంతో

Rain Alert : తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఆ  జిల్లాల్లోనే !

Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మళ్ళీ రెయిన్ అలర్ట్ వచ్చింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో పలు చోట్ల ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలవైపు కేంద్రీకృతమైందని వాతావరణ వెల్లడించింది. ఈ అల్పపీడనానికి నైరుతి రుతుపవనాలు తోడవడంతో ఉపరితల ద్రోణి ఏర్పడి ఉందని.. దాని ప్రభావంతో రాష్ట్రంలో గాలులు పెద్ద ఎత్తున వీచే అవకాశం ఉందని ప్రకటించింది.

ఈ క్రమంలోనే నేడు ఏపీ లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు  వర్షాలు కురిసే సూచనలున్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

భారీ వర్షాలు..

బాపట్ల, ఏలూరు, కృష్ణా, పార్వతీపురం మన్యం, ప్రకాశం, పశ్చిమగోదావరి, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని చెబుతున్నారు.

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..

శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, నెల్లూరు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవొచ్చని వెల్లడించారు.