Home / latest ap news
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో మొత్తం తొమ్మిది మంది మృతి చెందగా.. మరో ఏడుగురి పరిస్థితి విషయంగా ఉంది. శుక్రవారం తెల్లవారు జామున 3:30 గంటల సమయంలో కేవీ పల్లి మండలం మఠం పల్లి వద్ద తుఫాన్ వెహికల్ లారీని ఢీకొనడంతో 5 మంది మృతి చెందగా మరో 6 మంది తీవ్రంగా గాయపడ్డారు.
టీడీపీ, జనసేన పొత్తులపై మాజీ మంత్రి పేర్నినాని కౌంటర్ ఇచ్చారు. పవన్ చంద్రబాబును ఓదార్చడానికి వెళ్లారనుకున్నామని అయితే ఓదార్చడానికి వెళ్లారా లేక బేరం కుదర్చుకోవడానికి వెళ్లారా అంటూ నాని ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుతో పవన్ ది ములాఖత్ కాదు మిలాఖత్ అని తేలిందన్నారు.
చంద్రబాబుతో లాయర్ సిద్ధార్థ్ లూథ్రా ములాఖత్ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును లూథ్రా కలిశారు. న్యాయపరమైన విషయాలపై చంద్రబాబుతో లూథ్రా చర్చించారు. 45 నిమిషాల చర్చల అనంతరం బయటకి వచ్చిన లూథ్రా మీడియాతో మాట్లాడలేదు.
ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారం గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే దొంగ ఓట్లు ఎక్కువగా నమోదవుతున్నాయని కేంద్ర ఎన్నికల సంఘానికి ఎంపీ రఘురామకృష్ణరాజు గతంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు తాజాగా ఆయన ఫిర్యాదుకు ఎలక్షన్ కమిషన్ సమాధానం ఇచ్చింది. ఎంపీ రఘురామకు
రాజమండ్రి జైలులో చంద్రబాబుతో కుటుంబసభ్యులు ములాఖత్ అయ్యారు. . చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, బావమరిది రామకృష్ణ తదితరులు చంద్రబాబును కలిసారు. జైలులో చంద్రబాబుకు అందుతున్న సౌకర్యాలు, ఆరోగ్యంపై ఆరా తీసారు. దాదాపు 40 నిమిషాలపాటు ములాఖత్ అయ్యారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న నటుల్లో "శ్రీకాంత్ అయ్యంగార్" కూడా ఒకరు. రామ్ గోపాల్ వర్మ శిష్యులలో ఒకరైన ఈయన.. వర్మ తెరకెక్కించిన సినిమాలతోనే ఎక్కువగా ప్రేక్షకులను అలరించారు. ఇక ఈ మధ్య కాలంలో మంచి మంచి సినిమాల్లో నటిస్తూ హిట్లు అందుకుంటున్నాడు. ఈ మధ్యనే సామజవరగమనా
విశాఖపట్నం మర్రిపాలెంలో ఎండీ మహముద్దీన్ (46) కుటుంబంతో కలిసి నివాసముండేవాడు. అయితే ఏమైందో తెలీదు కానీ ఊహించని విధంగా మహముద్దీన్, అతని భార్య, కూతురు కూడా విజయనగరం జిల్లాలో మృత దేహాలుగా లభ్యమవడం స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. అయితే వారు ఏదైనా కష్టం వచ్చి ఆత్మహత్య చేసుకున్నారో
చంద్రబాబు జోలికి రావడం.. సైకో జగన్ చేసిన అతిపెద్ద తప్పని దీనికి రాజకీయంగా, వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించబోతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేసారు. సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్కు అధికారం అంటే ఏమిటో తెలియదన్నారు.
ప్రజా సమస్యలపై జనసేన ప్రశ్నిస్తుంటే వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్లో అలజడులు సృష్టిస్తున్నారంటూ వైసీపీ సర్కార్ పై మండిపడ్డారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. మన కోసం ఓ వ్యక్తి నిలబడినప్పుడు తిరిగి మద్దతివ్వడం పద్ధతని ఆయన చెప్పారు. ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ పై తీవ్ర స్దాయిలో మండిపడ్డారు.