Home / India
'మానవ అక్రమ రవాణా' అనుమానంతో 300 మందికి పైగా భారతీయ ప్రయాణికులతో నికరాగ్వాకు వెళ్తున్న విమానాన్ని ఆపిన ఫ్రెంచ్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై భారతీయ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు .
: జూలైలో తన ఫేస్బుక్ స్నేహితుడిని పెళ్లి చేసుకునేందుకు పాకిస్థాన్ వెళ్లిన రాజస్థాన్‌కు చెందిన అంజు రాఫెల్ అనే 34 ఏళ్ల మహిళ బుధవారం భారత్‌కు తిరిగి వచ్చింది.నేను సంతోషంగా ఉన్నాను. నాకు వేరే ఆలోచనలు లేవు అని అంజు తిరిగి వచ్చిన తర్వాత విలేకరులతో అన్నారు.
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) ప్యానెల్ తన పుస్తకాలపై ఇండియాకు బదులుగా 'భారత్' అని ముద్రించాలనే ప్రతిపాదనను దాని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.ప్యానెల్ సభ్యులలో ఒకరైన ఇస్సాక్ చెప్పిన దాని ప్రకారం, కొత్త NCERT పుస్తకాలు పేరు మార్పును కలిగి ఉంటాయి.
హమాస్ - ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా దెబ్బతిన్న పాలస్తీనాకు భారతదేశం ఆదివారం మానవతా సాయం పంపింది. దాదాపు 6.5 టన్నుల వైద్య సహాయం మరియు 32 టన్నుల విపత్తు సహాయ సామగ్రిని పాలస్తీనాకు పంపారు. ఇవి ఈజిప్టు మీదుగా పాలస్లీనాకు చేరుకుంటాయి.
ఇజ్రాయెల్ నుండి స్వదేశానికి తిరిగి రావాలనుకునే భారతీయుల కోసం 'ఆపరేషన్ అజయ్' ప్రారంభించినట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేక చార్టర్ విమానాలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నట్లు జైశంకర్ తెలిపారు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో దాదాపు 18,000 మంది భారతీయులు నివసిస్తున్నారని అంచనా.
ఇండియాలోని కెనడా రాయబార కార్యాలయంలో ఉన్న 40 మంది రాయబారులను ఈ నెల 10 వ తేదీలోగా దేశం విడిచిపోవాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ఫైనాన్షియల్ టైమ్స్ మంగళవారం నాడు ఓ వార్తను ప్రచురించింది. అయితే తాజా పరిణామలపై భారత ప్రభుత్వం అధికారికంగా ఓ ప్రకటనల విడుదల చేయాల్సి ఉంది.
ఆసియా కప్ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 8వ సారి ఆసియాకప్ విజేతగా భారత్ నిలిచింది. భారత బౌలర్ల దాటికి శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలింది. 51 పరుగుల విజయ లక్ష్యాన్ని 6.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని భారత్ చేధించింది.
G20 సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ న్యూఢిల్లీ వచ్చే ముందు దాదాపు అర డజను యూఎస్ ఉత్పత్తులపై అదనపు సుంకాలను భారతదేశం తొలగించింది. కొన్ని ఉక్కు మరియు అల్యూమినియం ఉత్పత్తులపై యునైటెడ్ స్టేట్స్ కస్టమ్స్ సుంకాలను పెంచిన తర్వాత, జూన్ 2019లో భారతదేశం 28 యూఎస్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పెంచింది.
సెప్టెంబరు 18-22 వరకు జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భారతదేశానికి భారత్‌గా పేరు మార్చే తీర్మానాన్ని ప్రభుత్వం తీసుకురావచ్చు. భారత రాజ్యాంగం ప్రస్తుతం దేశాన్ని భారతదేశం, అది భారత్..." అని సూచిస్తోంది, అయితే దీనిని కేవలం "భారత్"గా సవరించాలనే డిమాండ్ పెరుగుతోంది.
2024 నాటికి ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయిని అందించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పధకం హర్ ఘర్ జల్ పథకం కింద భారతదేశం ఈ సంవత్సరం సెకనుకు ఒక కుళాయి ఏర్పాటు చేసి రికార్డు సృష్టించింది. 2023 మొదటి ఎనిమిది నెలల్లో దేశం ఈ ఘనతను సాధించింది.