Home / India
Population:ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇండియా అవతరించింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి అధికారికంగా వెల్లడించింది. ఇందుకు సంబంధించిన తాజా నివేదికను ఐరాస బుధవారం విడుదల చేసింది. చైనా కంటే 29 లక్షల అధిక జనాభాతో భారత్ ఈ రికార్డు సాధించినట్టు ప్రకటించింది. చైనా జనాభా 142.57 కోట్లు కాగా, భారత్ లో 142.86 కోట్ల జనాభాతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. 1950 తర్వాత తొలిసారి(Population) 1950 నుంచి ఐక్యరాజ్య సమితి అత్యధిక జనాభా కలిగిన దేశాల […]
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం భారతదేశంలోని ముస్లింల స్థితిని సమర్థించారు. నిజంగా వారి పరిస్దితి బాగోకుంటే వారి జనాభా పెరగదని అన్నారు. పీటర్సన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ (PIIE)లో భారత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ మరియు వృద్ధిపై చర్చ సందర్భంగా నిర్మలా సీతారామన్ సోమవారం మాట్లాడారు.
: వచ్చే నెలలో కింగ్ చార్లెస్ III పట్టాభిషేకానికి ముందు 'కాస్ట్ ఆఫ్ ది క్రౌన్' సిరీస్‌లో భాగంగా, బ్రిటన్ రాజ సంపద మరియు ఆర్థిక విషయాలపై ది గార్డియన్ వార్తాపత్రిక వివరిస్తోంది.ఈ వారం నివేదికలలో ఒకదానిలోఇది క్వీన్ మేరీ, దివంగత క్వీన్ ఎలిజబెత్ II యొక్క నానమ్మ, ఆమె సామ్రాజ్య మూలాల గురించి వివరించింది.
రాడికల్ ఇస్లామిస్ట్ బోధకుడు జాకీర్ నాయక్‌ను ఒమన్ నుంచి బహిష్కరించే అవకాశం ఉంది. మార్చి 23న ఒమన్ పర్యటన సందర్భంగా నాయక్‌ను అదుపులోకి తీసుకునేందుకు భారత నిఘా సంస్థలు ఇప్పటికే ఒమన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయి.
స్మార్ట్ఫోన్ల ద్వారా స్పై, యూజర్ల డేటా దుర్వినియోగం అవుతున్న ఉదంతాలు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
టీమిండియా స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పి కారణంగా ఆటకు దూరమైన విషయం తెలిసిందే. ఇటీవల వెన్నునొప్పికి శస్త్రచికిత్స కోసం బుమ్రా న్యూజిలాండ్ వెళ్లిన సంగతి తెలిసిందే.
రష్యా నుండి భారతదేశం యొక్క ముడి చమురు దిగుమతులు ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో రోజుకు 1.6 మిలియన్ బ్యారెళ్లకు పెరిగాయి. సాంప్రదాయ సరఫరాదారులు ఇరాక్ మరియు సౌదీ అరేబియా నుండి కలిపి దిగుమతుల కంటే ఇది అధికం.
జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత కేవలం ట్యాక్స్ ల ద్వారానే ఈ నెలలో గరిష్ఠ ఆదాయం వచ్చిందని.. మొత్తంగా ఫిబ్రవరిలో రూ. 11,931 కోట్లు వసూలైంది.
తమిళనాడు రాష్ట్రానికి చెందిన మమ్మద్ రెహ్మతుల్తా సయ్యద్ అహ్మద్ ఈ కాల్పుల్లో మృతి చెందాడు. ఈ సంఘటన ఇండియన్ ఎంబసీ కూడా స్పందించింది.
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కెనడా పౌరసత్వం కారణంగా తరుచూ విమర్శలు ఎదుర్కొనే అక్షయ్ కుమార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు సర్వస్వం భారత్ అని వివరించారు.