Home / India
గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించిన వెంటనే ముస్లిం దేశాలన్నీ ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డాయి. తాజాగా వారి సరసన మాల్దీవ్స్‌కూడా జత చేరింది. ఇజ్రాయెల్ పౌరులను తమ దేశంలోకి అనుమతించమని తేల్చేసింది. దీనికి ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా గట్టిగానే స్పందించింది. తమ పౌరులను మాల్దీవ్స్ బదులు ఇండియాలోని లక్ష్యదీప్కు వెళ్లాలని సూచించింది.
మన దాయాది దేశం పాకిస్తాన్ ఎప్పుడు అబద్దాలు వల్లె వేస్తోంది తప్ప.. వాస్తవాలు మాత్రం చచ్చినా చెప్పదు. తిమ్మిన బమ్మిన చేయడంలో సిద్దహస్తురాలు. మరి అలాంటి పాక్‌కు మరి ఎందుకో జ్ఞానోదయం కలిగి చేసిన తప్పును ఒప్పకోవడం విశేషం. 1999లో ఇండియాతో కుదుర్చుకున్న లాహోర్ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించిందన్న చేదు నిజాన్ని పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ బట్టబయలు చేశారు.
స్మార్ట్ ఫోన్ తయారీరంగంలోకి గూగుల్ కూడా ఎంట్రీ ఇస్తోంది. ఇండియాలో డిక్సన్ టెక్నాలజీస్ ఈ స్మార్ట్ ఫోన్లను తయారు చేసిపెడుతుంది. కాగా గూగుల్ ఫిక్సిల్ 8 స్మార్ట్‌ఫోన్ ధర రూ 50,000లపై మాటే. మార్కెట్లో ఈ ఫోన్ ఆపిల్‌తో పాటు స్యాంసంగ్కు పోటీ ఇవ్వబోతోంది
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది . ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మే 15వ తేదీ వరకు 6.99 కోట్ల పనిదినాలను ఏపీ ప్రభుత్వం కల్పించింది. ఏపీ తర్వాత తెలంగాణ రెండో స్థానంలో నిలబడింది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశం నుంచి ఎగుమతులు రికార్డు బద్దలు కొట్టాయని ఆర్థికమంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 778 బిలియన్ డాలర్లుగా నమోదు కాగా.. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం 776.3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దిన దిన గండం నూరేళ్ల ఆయుషులా తయారైంది. దీనితో దేశ ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు ప్రధాని షెహబాజ్ షరీఫ్ నడుంబిగించారు. కరాచీలోని వ్యాపారవేత్తలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో దేశానికి చెందిన అతి పెద్ద వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలంటే ముందుగా రాజకీయ సుస్థిరతకు ప్రయత్నించాలని సూచించారు వ్యాపారవేత్తలు.
ప్రపంచవ్యాప్తంగా అవినీతి రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో డెన్మార్క్ అవినీతి రహిత దేశాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. అత్యంత అవినీతి కలిగిన దేశాల్లో సోమాలియా 11 స్కోరుతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, భారత్ 39 స్కోరుతో మొత్తం 180 దేశాల్లో 93వ స్థానంలో నిలిచింది.
ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణుల గ్రౌండ్ సిస్టమ్‌లను ఎగుమతి చేయడానికి భారతదేశం సిద్ధమయింది. సిస్టమ్ యొక్క క్షిపణులు ఈ ఏడాది మార్చి నాటికి ఫిలిప్పీన్స్‌కు చేరుకుంటాయని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ వెల్లడించారు.
ఛాబహార్ ఓడరేవును మరింత అభివృద్ధి చేయడానికి భారతదేశం, ఇరాన్ సోమవారం ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. విదేశాంగ మంత్రి జై శంకర్ టెహ్రాన్ పర్యటన సందర్భంగా ఇరాన్ రోడ్లు మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మెహర్దాద్ బజర్పాష్‌తో విస్తృత చర్చలు జరిపిన నేపధ్యంలో ఈ ఒప్పందం కుదిరింది. జైశంకర్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేసారు.
లష్కరే తోయిబా (ఎల్ఈటీ) వ్యవస్థాపకుడు, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను అప్పగించాల్సిందిగా భారత ప్రభుత్వం పాకిస్థాన్‌ను అధికారికంగా అభ్యర్థించింది.సయీద్‌ను అప్పగించేందుకు చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పాక్ ప్రభుత్వానికి అధికారిక అభ్యర్థనను పంపినట్లు వర్గాలు ధృవీకరించాయి.