Last Updated:

IPL 2025: నేడు ఉప్పల్‌లో హైదరాబాద్‌తో లక్నో ఢీ.. ఫ్యాన్స్‌కు స్పెషల్ బస్సులు

IPL 2025: నేడు ఉప్పల్‌లో హైదరాబాద్‌తో లక్నో ఢీ.. ఫ్యాన్స్‌కు స్పెషల్ బస్సులు

Sunrisers Hyderabad vs Lucknow Super Giants Match in IPL 2025: ఐపీఎల్ 2025లో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో లక్నో సూపర్ జెయింట్స్ ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ ఉప్పల్ వేదికగా రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మైదానం బ్యాటింగ్ పిచ్ కావడంతో ఇరుజట్ల మధ్య పరుగుల వరద పారనుంది. ఇప్పటికే భీకరమైన ఫామ్‌లో ఉన్న హైదరాబాద్ బ్యాటర్లు మరోసారి రికార్డు స్కోరు చేసే అవకాశం ఉంది. అలాగే లక్నో జట్టు కూడా బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తుండడంతో మైదానంలో సిక్సర్ల వర్షం కురవనుంది. ఇక, ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో లక్నో మూడు సార్లు, హైదరాబాద్ ఒకసారి విజయం సాధించాయి.

 

ఉప్పల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మ్యాచ్ ఉన్నందున ఫ్యాన్స్‌కు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు స్టేడియం వద్దకు స్పెషల్ బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది. ఈ బస్సులు హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల నుంచి నడవనున్నాయి. ఉప్పల్ స్టేడియానికి వచ్చేందుకు గ్రేటర్ పరిధిలోని 24 డిపోల నుంచి 60 స్పెషల్ బస్సులను ఆపరేట్ చేయనుంది. ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్న తేదీల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.

 

కాగా, ఉప్పల్ స్టేడియంలో ఏప్రిల్ 6, 12,23, మే 5, 10, 20, 21 తేదీల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రధానంగా ఘట్కేసర్, హయత్ నగర్, ఎన్జీవోస్ కాలనీ, ఎల్ బీనగర్, కోఠి, లక్డీ కపూల్, దిల్ సుఖ్ నగర్, మేడ్చల్, కేపీహెచ్‌బీ కాలనీ, మియాపూర్, జేబీఎస్, ఈసీఐఎల్, బోయిన్ పల్లి, చార్మినార్, చాంద్రాయణగుట్ట, మెహదీపట్నం, బీహెచ్ఈఎల్ వంటి వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియం వరకు ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడపనుంది. ఈ అవకాశాన్ని ఫ్యాన్స్ సద్వినియోగం చేసుకోవాలని టీజీఎస్ ఆర్టీసీ సూచించింది.