Published On:

IPL 2025 24th Match: బెంగళూరును దెబ్బతీసిన రాహుల్.. వరుసగా ఢిల్లీ నాలుగో విజయం!

IPL 2025 24th Match: బెంగళూరును దెబ్బతీసిన రాహుల్.. వరుసగా ఢిల్లీ నాలుగో విజయం!

Royal Challengers Bengaluru Vs Delhi Capitals IPL 2025 24th match: ఐపీఎల్ 2025లో భాగంగా ఈ సీజన్‌లో బెంగళూరుతో ఢిల్లీ తలపడింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టుపై ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఢిల్లీకి వరుసగా నాలుగో విజయం కాగా, బెంగళూరు జట్టుకు రెండో ఓటమి. బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన 24వ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లకు 163 పరుగులు చేసింది.

 

తొలి మూడు ఓవర్లలోనే 50 పరుగులు దాటిన బెంగళూరు.. ఫిల్ సాల్ట్(37)రనౌట్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. భారీ స్కోరు వెళ్తుందని ఆశించగా.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు విఫలమయ్యారు. వరుసగా పడిక్కల్(1), కోహ్లీ(22), రజత్ పాటీదార్(25), లివింగ్ స్టోన్(4), జితేశ్ శర్మ(3) ఔట్ అయ్యారు. చివరలో కృనాల్(18), డేవిడ్(37) చెలరేగడంతో 163 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో విప్రాజ్ నిగమ్, కుల్ దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. ముకేశ్, మోహిత్ తలో వికెట్ తీశారు.

 

164 పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీ తొలుత తడబడింది. ఓపెనర్లు డుప్లెసిప్(2), జేక్ ఫ్రేజర్(7), అభిషేక్ ఫోరెల్(7) విఫలమయ్యారు. ఆ తర్వాత నిలకడగా ఆడుతున్న అక్షర్(15) ను సుయాశ్ ఔట్ చేశారు. ఇక, రాహుల్(93) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతోపాటు స్టబ్స్(38) మంచి సహకారం అందించాడు. దీంతో ఢిల్లీ కేవలం 17.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 164 పరుగులను ఛేదించింది. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ రెండు వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, సుయాశ్ శర్మ తలో వికెట్ తీశారు.