Published On:

Israel : హమాస్‌ టాప్‌ కమాండర్‌‌ను మట్టుబెట్టడానికి ఇజ్రాయెల్‌ ప్లాన్‌

Israel : హమాస్‌ టాప్‌ కమాండర్‌‌ను మట్టుబెట్టడానికి ఇజ్రాయెల్‌ ప్లాన్‌

Israel : హమాస్‌ టాప్‌ కమాండర్‌ మహమ్మద్‌ సిన్వర్‌ను మట్టుబెట్టడానికి ఇజ్రాయెల్‌ పక్కా ప్లానింగ్‌తో గత నెల 13న దాడి చేసింది. పదుల సంఖ్యలో బాంబులు ప్రయోగించి హమాస్ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ధ్వంసం చేసింది. దాడికి సంబంధించిన 3డీ వీడియోను తాజాగా ఇజ్రాయెల్‌ బలగాలు విడుదల చేశాయి. ఖాన్‌ యూనిస్‌లోని యూరోపియన్‌ ఆసుపత్రి కింద కమాండ్‌ సెంటర్‌ ఉన్నట్లు ఇజ్రాయెల్‌ ఆరోపించింది. హమాస్‌ ఉద్దేశపూర్వకంగా అక్కడ తమ స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ఆపరేషన్‌ను ఐడీఎఫ్‌ బలగాలు, ఇజ్రాయెల్‌ సెక్యూరిటీ అథారిటీ సంయుక్తంగా నిర్వహించాయి. దాడికి బాగాపనిచేసే ఆయుధాలను వినియోగించినట్లు పేర్కొన్నాయి.

 

కేవలం 30 సెకన్లలో 50 బాంబులు..
దాడి సమయంలో కేవలం 30 సెకన్లలో 50 బాంబులు హమాస్‌ కమాండ్‌ కేంద్రంపై విసిరేశారు. దీంతో ఆసుప్రతి భవనం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందుకోసం భారీగా ఇంటెలిజెన్స్‌ను సేకరించారు. మరోవైపు దాడిలో 16 మంది మృతిచెందగా, 70 మంది గాయపడినట్లు హమాస్‌ నేతృత్వంలోని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

 

హమాస్‌ అధినేత యాహ్యా సిన్వర్‌ సోదరుడే మహ్మద్‌ సిన్వర్‌. సంస్థ మిలటరీ వింగ్‌ సారథి డెయిఫ్‌ మృతి తర్వాత బాధ్యతలను మహ్మద్‌ చేపట్టాడు. అనంతరం తన సోదరుడు యాహ్యా సిన్వర్ మృతి తర్వాత హమాస్‌ టాప్‌ కమాండర్‌గా ఎదిగాడు. 2023 అక్టోబర్‌ 7వ తేదీన ఇజ్రాయెల్‌ మెరుపుదాడి సూత్రధారిగా యాహ్యా సిన్వర్‌ ఉన్నారు. అతడు గతేడాది మృతిచెందాడు. తాజాగా ఇతడు కూడా హతమయ్యాడు. అంతకుముందు హమాస్‌ అధినేతగా ఉన్న ఇస్మాయెల్‌ హనియే గతేడాది జూలైలో ఇరాన్‌లోని టెహ్రాన్‌లో జరిగిన బాంబు పేలుడు ఘటనలో మృతిచెందాడు.

ఇవి కూడా చదవండి: