Last Updated:

PT Usha : భారత ఒలింపిక్​ సంఘం అధ్యక్షురాలిగా పీటీ ఉష ?

పరుగుల రాణి పీటీ ఉష మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకోనున్నారు. భారత ఒలింపిక్​ సంఘం అధ్యక్షురాలిగా ఎన్నిక లాంఛనమైంది.

PT Usha : భారత ఒలింపిక్​ సంఘం అధ్యక్షురాలిగా  పీటీ ఉష ?

PT Usha: పరుగుల రాణి పీటీ ఉష మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకోనున్నారు. భారత ఒలింపిక్​ సంఘం అధ్యక్షురాలిగా ఎన్నిక లాంఛనమైంది. ఈ మేరకు అధ్యక్ష పదవికి నామినేషన్ ​దాఖలు చేశారు. డిసెంబర్‌లో జరిగే భారత ఒలింపిక్ సంఘం అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. ఆమెతో పాటు 14 మంది కార్యవర్గ సభ్యులు కూడా నామినేషన్లు సమర్పించారు. అధ్యక్ష పదవికి మరెవరూ నిమినేషన్​ వేయలేదు. దీంతో పీటీ ఉష ఎన్నిక దాదాపు ఖాయమైంది. అథ్లెటిక్స్​లో ఎన్నో పథకాలు సొంతం చేసుకున్న ఉష.. కీర్తి కిరీటంలో ఇది మరో మైలురాయి.

ఇండియన్ ఒలింపిక్​ అసోషియేషన్​లోని వివిధ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో అధ్యక్షుడు, సీనియర్ వైస్​ ప్రెసిడెంట్, రెండు వైస్​ ప్రెసిడెంట్ స్థానాలు, కోశాధికారి, రెండు జాయింట్​ సెక్రటరీ స్థానాలు, 6 కార్యనిర్వాహక మండలి సభ్యుల స్థానాలు ఉన్నాయి. ఈ ఆరుగురిలో ఇద్దరు అథ్లెట్స్​ కమిషన్ ప్రతినిధులు ఉంటారు. ఇప్పటివరకు పీటీ ఉష వివిధ ఆసియా గేమ్స్‌లో గోల్డ్ మెడల్స్​సాధించారు. 1984లో జరిగిన ఒలింపిక్స్​లో 400 మీటర్ల హర్డల్స్ ఈవెంట్‌​ఫైనల్‌లో నాలుగో స్థానంలో నిలిచారు.

ఇవి కూడా చదవండి: