MI Vs RCB- IPL 2025: ముంబైతో బెంగళూరు మ్యాచ్.. ఆర్సీబీ బ్యాటింగ్.. ప్రమాదకర బౌలర్ వచ్చేశాడు

Mumbai Indians Vs Royal Challengers Bengaluru in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. ముంబై వేదికగా వాంఖడే స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో బెంగళూరు 3 మ్యాచ్‌లు ఆడగా.. రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. ఒక్క మ్యాచ్‌లో ఓడింది. ముంబై 4 మ్యాచ్‌లు ఆడగా.. మూడింట్లో ఓడి ఒక్క మ్యాచ్‌లో గెలుపొందింది.
అయితే, ముంబై స్టార్ పేసర్, ప్రమాదకర బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో ముంబై బౌలింగ్‌కు బలం చేకూరింది. గాయం కారణంగా ఈ సీజన్‌లో మొదటి నాలుగు మ్యాచ్‌లకు బుమ్రా దూరమయ్యాడు. బుమ్రా లేకుండా ముంబై ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు మ్యాచ్‌ల్లో ఓటమి చెందింది.
బుమ్రా.. 3 నెలల తర్వాత మైదానంలోకి అడుగుపెడుతున్నాడు. బుమ్రా బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటామని ఆర్సీబీ ప్లేయర్ టిమ్ డేవిడ్ వ్యాఖ్యానించాడు. గత సీజన్‌లో వీరిద్దర ముంబై ఫ్రాంచైజీకి ఆడారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్.
ముంబై ఇండియన్స్: విల్ జాక్స్, ర్యాన్ రికెల్‌టన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా, విఘ్నేష్ పుత్తూర్.