Published On:

Brahmamudi Serial Today June 18th Episode: యామినికి బిగ్‌ షాక్‌, నీది ప్రేమ కాదు.. స్వార్థం.. కూతురిపై రఘునందన్ ఫైర్, అసలేం జరిగిందంటే?

Brahmamudi Serial Today June 18th Episode: యామినికి బిగ్‌ షాక్‌, నీది ప్రేమ కాదు.. స్వార్థం.. కూతురిపై రఘునందన్ ఫైర్, అసలేం జరిగిందంటే?

Brahmamudi Serial Today June 18th Full Episode: బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన సీరియల్లో ‘బ్రహ్మముడి’ ఒకటి. ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతోంది. కలిసిపోయిన భార్యభర్తలను విడదీసి.. మళ్లీ వారిమధ్య లవ్‌ ట్రాక్‌ నడిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు డైరెక్టర్. ఈ జంట మధ్యలో మూడో వ్యక్తిని తీసుకువచ్చి టెన్షన్‌ పెడుతున్నాడు. గతం మర్చిపోయిన రాజ్‌ తన భార్య కావ్యతో ప్రేమలో ఉంటాడు. మరోవైపు యామినితో పెళ్లికి ఒప్పుకుంటాడు. ఇలా నిన్నటి ఎపిసోడ్‌లో రాజ్‌, యామినిల నిశ్చితార్థం జరుగుతుంది. మరి నేటి (జూన్‌ 18) ఎపిసోడ్‌లో ఏం జరుగిందో చూద్దాం!

 

ఇందిరాదేవి, అపర్ణ, కనకం, అప్పు, కళ్యాణ్‌, ధాన్యలక్ష్మి, ప్రకాశం అంతా కలిసి ఈ పెళ్లిని ఆపడానికి శతవిధాలు ప్రయత్నిస్తుంటారు. ఇక యామినితో నిశ్చితార్థం తర్వాత ఈ పెళ్లి ఎక్కడో జరుగుతుందోనని రాజ్‌ టెన్షన్‌ పడుతుంటాడు. ఇంతలో ఇందిరాదేవి, అపర్ణ రాజ్‌ దగ్గరి వస్తారు. ఇందిరాదేవి: ఏంటి మనవడా నిశ్చితార్థం రింగ్‌ చూసుకుని సంబరపడిపోతున్నావా? అని వెటకారంగా అంటుంది. రాజ్.. మీకు కామెడీగా ఉందా నాన్నమ్మా అని నిట్టూరుస్తాడు. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముందిరా ఈ నిర్ణయం తీసుకోక ముందు ఆలోచించాలని అపర్ణ అంటుంది. ‘కనకం గారు చెప్పినప్పటి నుంచి ఇంకా కంగారు పెరిగింది. ఆవిడేమో నాకు యామినికి రాసిపెట్టిలేదు. అందుకే అడ్డంకులు వస్తున్నాయి అంటుంది. కళావతి గారిని చేసుకోవడమే కరెక్ట్‌ అంటుంది’ అని రాజ్‌ అంటాడు.

 

దానికి అపర్ణ.. వాళ్లు వీళ్లు చెప్పడం కాదు. అసలు నీకు ఏమనిపిస్తుందో చెప్పు అని రాజ్‌ని అడుగుతుంది. ఈ పెళ్లి వద్దంటే యామిని ఏం చేసుకుంటుందోనని భయంగా ఉంది. నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదమ్మ అంటాడు రాజ్‌. ఇంతలో యామిని తల్లి వైదేహి.. అల్లుడు గారు ఏంటి అలా దూరంగా నిలబడ్డారు. వచ్చి యామినికి మెహందీ పెట్టండి అని చెబుతుంది. వెంటనే పక్కనే ఉన్న ఇందిరా దేవి.. వెళ్లు.. వెళ్లి మెహందీ అంట పెట్టు అని వెటకారంగా అంటుంది. ఇక రాజ్‌ యామిని దగ్గరకు నడుచుకుంటూ వెళ్తుండగా.. కావ్య ఎదురువస్తుంది. కావ్యను చూసి రాజ్‌ అలాగే నిలబడిపోతాడు. వైదేహి బలవంతంగా రాజ్‌ను యామిని పక్కన కూర్చోబెడుతుంది.

 

ఇదంతా అక్కడే నిలబడి చూస్తుంటారు అప్పు, అపర్ణలు. ఇదంతా జరుగుతుంది చూసి.. ఏంటి అప్పు ఏదో ప్లాన్‌ చేశావు అన్నావ్‌.. అసలు మెహందీ పెట్టుకోవడానికి ఆ యామిని రాదన్నావ్‌ అని అడుగుతంది.. వచ్చినా కూడా పెట్టించుకోవాలి కదా అత్తయ్యా.. ఏం జరుగుతుందో మీరే చూడండి అంటుంది అప్పు. అదే టైంలో కానిస్టేబుల్‌ రౌడీని తీసుకుని యామిని ఇంటికి వస్తాడు. బయటే నిలబడి రౌడీ చేత యామినికి ఫోన్‌ చేయిస్తాడు. యామిని బయపడుతూ ఫోన్‌ లిఫ్ట్‌ చేస్తుంది. రౌడీ.. మేడం బెయిల్‌ మీద పోలీస్‌ స్టేషన్‌ నుంచి బయటకు వచ్చేశాను. నాకు రెండు రోజుల టైం ఉంది. నేను కనక ఇప్పుడు దేశం వదిలి వెళ్లకపోతే నన్ను అరెస్ట్ చేస్తారు.

 

దానికి మీరే హెల్ప్‌ చేయాలని అడుగుతాడు. ఓ అవునా నాకు మ్యారేజ్‌ ఫిక్స్‌ అయ్యింది.. రేపే నా పెళ్లి.. ఆ హడావిడిలో ఉన్నాను. నేను తర్వాత ఫోన్‌ చేయొచ్చా.. అని టెన్షన్‌ పడుతుంది. దీనికి రౌడీ.. నేను పారిపోవడానికి నాకు ఈ ఒక్కరోజే టైం ఉందంటే మీరు పెళ్లి అంటారేంటి? మళ్లీ నేను రేపు స్టేషన్‌కు వెళ్లాలి. మీ కోసం మీ ఇంటి బయటే వెయిట్‌ చేస్తున్నాను. మీరు వస్తే సెటిల్‌ చేసుకుందాం. లేకపోతే మళ్లీ స్టేషన్‌కు వెళితే నా చేత ఆ పనులు చేయించింది మీరే అని కోర్టులో చెప్పాల్సి వస్తుంది. మీ కోసం ఐదు నిమిషాలు వెయిట్‌ చేస్తాను.. అని ఆ రౌ డీ యామినిని బ్లాక్‌మెయిల్‌ చేస్తాడు. రౌడీ మాటలకు బయపడిన యామిని.. అవునా.. నేను వస్తున్నానంటుంది. బయటకు వెళ్తానంటే.. మెహందీ ఫంక్షన్‌ పెట్టుకుని బయటకు వెళ్తానంటావేంటి? అంటారు. మా ఫ్రెండ్‌కు ఏదో ప్రాబ్లమ్‌ వచ్చిందట నన్ను రమ్మంటుంది నేను వెళ్లి వెంటనే వస్తాను అమ్మా అంటుంది యామిని.

 

బాగుంది యామిని కనీసం ఈ మెహందీ ఒక్కటైనా సరిగ్గా జరుగుతుంది అనుకున్నాను. ఈ లోపల నువ్వే చెడగొట్టుకునేలా ఉన్నావు అంటుంది ధాన్యం. మా వాడు మెహందీ పెట్టడానికి రెడీ అయిపోయాడు.. ఈ టైంలో ఇంతకంటే ముఖ్యమైన పనేంటి..? అంటాడు ప్రకాశం. వెంటనే వైదేహి.. అవును బేబీ ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం.. ముందు మెహందీ కానివ్వు అంటుంది. ఇంపార్టెంట్‌ పని అని చెప్పాను కదా మమ్మీ అనగానే.. ఇందిరాదేవి మధ్యలో కలుగజేసుకుని ఆ పనేంటో మాకు చెప్పు యామిని అని అడుగుతుంది. మాకు చెప్పకపోతే పోయావు. కనీసం నీకు కాబోయే మొగుడికైనా చెప్పమ్మా పెళ్లి చేసుకునే వాళ్ల మధ్య సీక్రెట్స్‌ ఉండకూడదు కదా అని కనకం చురకలు అట్టిస్తుంది.

 

ఇక కనకం అలా అనగానే యామిని.. నన్ను ఎవరూ నమ్మాల్సిన పనిలేదు. బావ నమ్మితే చాలు. బావ నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటకు వెళ్తుంది. రౌడీని బెదిరించాలని వెళ్లిన యామినికి బిగ్‌షాక్‌ తగులుతుంది. తనకు కోటి రూపాయలు కావాలని, లేదంటే పోలీసులకు అసలు విషయం చెబుతా అంటూ బ్లాక్‌మెయిల్‌ చేస్తాడు. ఇదంత చాటు నుంచి అప్పు, కళ్యాణ్‌లు వింటుంటారు. అదే టైంలో యామిని తల్లిదండ్రులు అక్కడికి వస్తారు. ఏంటి? కోటి రూపాయలు ఎందుకు అడుగుతున్నాడు అని ప్రశ్నిస్తాడు. నేను చెబుతాలే.. నువ్వు వెళ్లు డబ్బు అరెంజ్‌ చేసి ఇస్తాను అంటుంది యామిని.

 

లోపలికి వెళ్లాక తన తల్లిదండ్రులకు అంతా చెబుతుంది. దీంతో యామిని తండ్రి ఆమెను మందలిస్తాడు. ‘రాజ్‌ను దక్కించుకోవడం కోసం ఏమైనా చేస్తావా? మనుషుల ప్రాణాలు కూడా తీయిస్తావా.. అలా దాన్ని ప్రేమ అనరు.. స్వార్థం అంటారు. బలవంతం దక్కించుకోవాలని ఏది చేస్తే అది జరగదు.. ఒకవేళ జరిగినా ఎక్కువకాలం ఉండదు’ అంటూ యామిని తండ్రి అంటాడు. సరేలే ముందు డబ్బుల విషయం చూడు. అంటుంది. ఇంతలోనే అక్కడికి రుద్రాణి, రాహుల్‌ వస్తారు. మరోవైపు కావ్య.. రెడ్‌ కలర్‌ చీరకట్టి అందంగా ముస్తాబై వస్తుంది. కావ్యను అలా చూసి షాకైన స్వప్ప నిన్ను చూస్తుంటే ఏమనాలో అర్థం కావడం లేదే.. ఓ పక్క నీ మొగుడు మరో ఆడదాని మెడలో తాళి కట్టబోతుంటే నువ్వు పెళ్లి పెద్దలా బాగానే రెడీ అయ్యావు అని అంటుంది.

 

ఈ పెళ్లి జరగదక్క.. అని కావ్య ధైర్యం ప్రదర్శిస్తుంది. ఇంతలో రాజ్‌ రావడం గమనించి అక్కడి నుంచి వెళ్లిపోతుంటే.. రాజ్‌, కావ్యను చూసి పారిపోకే పిట్ట అంటూ పాట పాడుతుంటాడు. నన్ను చూసి ఎందుకు పాడుతున్నావ్‌.. ఓ పక్క యామిని మెడలో తాళి కట్టబోతూ.. నన్ను చూసి పాటలు పాడటం కరెక్టేనా అని రాజ్‌ని నిలదీస్తుంది. దీంతో నా పెళ్లి జరుగుతుంటే నీకు బాధలేదని రాజ్‌ అడగడంతో ఎపిసోడ్‌ పూర్తవుతుంది.

 

 

ఇవి కూడా చదవండి: