IPL 2025: ఇవాళ మరో కీలక మ్యాచ్.. లక్నోతో ముంబై ఢీ

Lucknow Super Giants vs Mumbai Indians: ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. లక్నో వేదికగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడగా.. తొలుత వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. తర్వాత మ్యాచ్‌లో సొంతగడ్డపై కోల్‌కతాను చిత్తు చేసి ఆత్మవిశ్వాసంతో బరిలో దిగుతోంది. ఇక, లక్నో జట్టు కూడా మూడు మ్యాచ్‌లు ఆడగా.. రెండు మ్యాచ్‌ల్లో ఓడి ఒక్క మ్యాచ్ మాత్రమే విజయం సాధించింది. చివరగా ఆడిన మూడో మ్యాచ్‌లో పంజాబ్ చేతితో ఘోర ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ముంబైపై విజయం సాధించాలని భావిస్తోంది. ఇక, పాయింట్ల పట్టికలో ముంబై 6 వ స్థానంలో కొనసాగుతుండగా.. లక్నో 7వ స్థానానికి పరిమితమైంది.