IPL 2025 40th Match: నేడు కీలక పోరు.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ ఢీ

Lucknow Super Giants vs Delhi Capitals, IPL 2025 40th Match: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్‌లో నేడు 40వ మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగానే ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ఇరు జట్లు మధ్య 6 మ్యాచ్‌లు జరగగా.. తలో 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి.
ఈ ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 5 మ్యాచ్‌ల్లో గెలువగా.. 2 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ రెండో స్థానంలో కొనసాగుతోంది. అలాగే లక్నో సూపర్ జెయింట్స్ 8 మ్యాచ్‌లు ఆడగా.. 5 మ్యాచ్‌ల్లో నెగ్గి 3 మ్యాచ్‌ల్లో ఓడింది. పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది.
తుది జట్ల అంచనా..
లక్నో సూపర్ జెయింట్స్: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్), ఆయుష్ బదోనీ, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ నమద్, శార్దూల్ ఠాకూర్, దిగ్వేష్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్.
ఢిల్లీ క్యాపిటల్స్: కరుణ్ నాయర్, అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్, నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, మోహిత్ శర్మ.