Published On:

IPL 2025 39th Match: కోల్‌కతాపై గిల్, సుదర్శన్ మెరుపు ఇన్నింగ్స్.. గుజరాత్‌కు ఆరో గెలుపు

IPL 2025 39th Match: కోల్‌కతాపై గిల్, సుదర్శన్ మెరుపు ఇన్నింగ్స్.. గుజరాత్‌కు ఆరో గెలుపు

Gujarat Titans won the match Against Kolkata Knight Riders IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్ రసవత్తరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగానే కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ గెలుపొందింది. దీంతో ఈ సీజన్‌లో టైటాన్స్ ఆరో విజయాన్ని అందుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాను 39 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది.

 

తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 198 పరుగులు చేసింది. ఓపెనర్లు సుదర్శన్(52, 36 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ గిల్(90, 55 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 114 పరుగులు జోడించారు. రసెల్ వేసిన బౌలింగ్‌లో సుదర్శన్ కీపర్ గుర్బాజ్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన బట్లర్(41, 23 బంతుల్లో 8 పోర్లు) సహాయంతో గిల్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.దూకుడుగా ఆడుతున్న సమయంలో సెంచరీకి చేరువలో ఉన్న గిల్ 90 పరుగుల వద్ద భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి రింకూ‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. చివరిలో షారుఖ్(11) చేయడంతో గుజరాత్ టైటాన్స్ 198 పరుగులకు చేరింది. కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా, హర్షిత్ రానా, రస్సెల్ తలో వికెట్ తీశారు.

 

అనంతరం 199 పరుగుల భారీ లక్ష్యఛేదనలో కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులే చేసింది. కెప్టెన్ అజింక్యా రహానె(50), ఆండ్రీ రస్సెల్(21), రఘువంశీ( 27), రింకు సింగు(17) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్, ప్రసిద్ధ కృష్ణ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, వాషింగ్టన్ సుందర్, సాయి కిశోర్, ఇషాంత్ శర్మ తలో వికెట్ తీశారు.