Published On:

Austria School : ఆస్ట్రియా పాఠశాలలో కాల్పులు.. 8 మంది దుర్మరణం

Austria School : ఆస్ట్రియా పాఠశాలలో కాల్పులు.. 8 మంది దుర్మరణం

Vienna : ఆస్ట్రియాలోని గ్రాజ్ సిటీలో ఉన్న లెండ్ ప్రాంతంలోని పాఠశాలలో కాల్పులు జరిగాయి. కాల్పుల్లో 8 మంది మృతిచెందారు. షూటింగ్ ఘ‌ట‌న‌కు దీటుటా పోలీసులు స్పందిస్తున్నారు. షూటింగ్ జరిగిన ప్రాంతాన్ని పోలీసులు సీజ్ చేశారు. బాధితుల ప‌ట్ల సానుభూతి వ్య‌క్తం చేశారు. కాల్పుల్లో అనేక మంది గాయ‌ప‌డ్డారు. ఇందులో విద్యార్థులు, టీచ‌ర్లు ఉన్న‌ట్లు తెలిసింది. ఓ వీధిలో పోలీసులు సెర్చ్ ఆప‌రేష‌న్ ప్రారంభించారు. ఆ ప్రాంతంలో సెకండ‌రీ పాఠశాల ఉన్న‌ట్లు తెలుస్తోంది. అధికారులు కాల్పుల ఘటనపై ఇంకా పూర్తి వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు. ఆస్ట్రియాలో రెండో అతిపెద్ద నగరం గ్రాజ్. దేశ రాజధాని వియన్నాకు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి జనాభా సుమారు 3 లక్షలు.

ఇవి కూడా చదవండి: