Home / South Korea
South Korea Plane Crash almost 179 People Feared Dead: సౌత్ కొరియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 179 మంది మృతి చెందారు. ఎయిర్ పోర్టు గోడను ఢీకొని విమానం పేలింది. ల్యాండింగ్ సమయంలో రన్ వేపై విమానం అదుపు తప్పింది. ఈ ఘటన ముయాన్ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. ఈ విమానం బ్యాంకాక్ నుంచి ముయాన్ వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు […]
దక్షిణ కొరియా రాజధాని సియోల్ సమీపంలోని లిథియం బ్యాటరీ తయారీ కర్మాగారంలో సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో 20 మంది మరణించగా నలుగురు గాయపడ్డారు. ఈ సందర్బంగా 15 మంది తప్పిపోయినట్లు యోన్‌హాప్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అగ్నిమాపక అధికారి ఒకరు తెలిపారు.
దక్షిణ కొరియాను కవ్విస్తోంది ఉత్తర కొరియా. డీమిలిటరైజ్డ్ జోన్ ను దాటి దక్షిణ కొరియా భూభాగంలోకి చొచ్చుకు వచ్చారు. దీన్ని దక్షిణ కొరియా తీవ్రంగా ప్రతిఘటించింది. వెంటనే వారిని హెచ్చరిస్తూ గాల్లో కాల్పులు కూడా జరిపింది.
దేశంలో క్షీణిస్తున్న జనన రేటును పెంచే ప్రయత్నంలో జన్మించిన ప్రతి శిశువుకు తల్లిదండ్రులకు నగదు ప్రోత్సాహకాలను చెల్లించాలని దక్షిణ కొరియా పరిశీలిస్తోంది.దక్షిణ కొరియా ప్రభుత్వ అవినీతి నిరోధక మరియు పౌర హక్కుల కమిషన్ దీనిని అమలు చేయడానికి ముందు ప్రజల అభిప్రాయాన్ని అంచనా వేయడానికి ఒక పబ్లిక్ సర్వేను నిర్వహిస్తోంది.
ఒక లగ్జరీ బ్యాగ్ దక్షిణ కొరియా అధికార పార్టీని షేక్ చేస్తోంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. ప్రథమ మహిళ కిమ్ కియోన్ హీ ఖరీదైన బ్యాగ్‌ను బహుమతిగా పొందారంటూ వైరల్ అయిన దృశ్యాలు ఈ పరిస్థితి కారణమయ్యాయి.
దక్షిణ కొరియా పార్లమెంటు కుక్క మాంసం పరిశ్రమను నిషేధించే చట్టాన్ని మంగళవారం ఆమోదించింది. జాతీయ అసెంబ్లీ 208-0 ఓట్ల తేడాతో ఈ బిల్లును ఆమోదించింది. ప్రెసిడెంట్ యూన్ సుక్ యోల్ ప్రభుత్వం నిషేధానికి మద్దతు ఇస్తోంది.దీనితో చట్టం చేయడానికి తదుపరి చర్యలు లాంఛనప్రాయంగా పరిగణించబడతాయి.
దక్షిణ కొరియాలో భారీ వర్షాల కారణంగా సంభవించిన కొండచరియలు మరియు వరదల కారణంగా ఇప్పటివరకు 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది తప్పిపోయినట్లు శనివారం ప్రభుత్వం తెలిపింది
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై సౌత్ కొరియా నిఘా సంస్థ నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ పలు కీలక విషయాలు సేకరించింది. కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర నిద్రలేమి తో బాధపడుతున్నట్టు గుర్తించింది.
అమెరికా మిలిటరీ కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు జూన్ 11 తేదీ లోపల ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్టు ఇటీవల నార్త్ కొరియా ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఈ ప్రయెగం విఫలం అవ్వడంతో తర్వలోనే రెండో లాంచ్ కు సిద్దమైనట్టు ఉత్తర కొరియా తెలిపింది.
దక్షిణ కొరియాలో ఏషియానా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమాన డోర్‌ను ఓ ప్యాసింజెర్ తెరిచాడు. దీనితో విమానం లోపల భారీ గాలి ప్రకంపనలు వచ్చాయి. ఆ సమయంలో విమానంలో 194 మంది ప్రయాణికులు ఉన్నారు. సిబ్బంది విమానాన్ని డేగూ విమానాశ్రయంలో దించారు.