IPL 2025: నేడు ఢిల్లీ, లక్నో మధ్య ఆసక్తికర పోరు

Delhi Capitals vs Lucknow Super Giants: ఐపీఎల్ 2025లో ఇవాళ ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య పోరు ఉండనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఇక ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 5 సార్లు తలపడ్డాయి. ఇందులో లక్నో మూడు సార్లు విజయం సాధించగా.. ఢిల్లీ రెండు సార్లు గెలుపొందింది. ఇక, వేలంలో రెండు జట్ల మధ్య రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ స్వాప్ అవ్వడం కారణంగా ఈ మ్యాచ్ మరింత ఆసక్తిని పెంచుతోంది.
అయితే రిషబ్ పంత్ గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించగా.. ఈ సీజన్‌లో లక్నో జట్లుకు కెప్టెన్‌గా చేయడం విశేషం. లక్నో జట్టుకు మెంటర్‌గా జహీర్ ఖాన్, హెడ్ కోచ్‌గా లాంగర్ ఉన్నారు. బ్యాటింగ్ విషయానికొస్తే.. ఆయూష్, డేవిడ్ మిల్లర్, సమద్, ఆల్ రౌండర్లు మార్క్రమ్, మార్ష, షాబాజ్, బౌలింగ్‌లో రవి బిష్ణోయ్, ఆవేష్, ఆకాష్ ఉన్నారు. ఒక, ఢిల్లీ జట్టు కూడా బ్యాటింగ్ పరంగా బలంగా కనిసిస్తోంది.
అయితే ఈ సీజన్‌లో పెద్ద మార్పులతో తొలిసారిగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. దీంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది.