Piyush Chawla : అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన పీయూష్ చావ్లా

Senior Indian leg-spinner Piyush Chawla : ఇండియా సీనియర్ లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి గుడ్‌బాయ్ చెప్పాడు. శుక్రవారం రిటైర్‌మెంట్ ప్రకటించినట్లు ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేశాడు. తనకు సహాయ సహకారాలు అందించిన కుటుంబ సభ్యులు, ఐపీఎల్ ఫ్రాంఛైజీలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.
36 ఏళ్ల పీయూష్ చావ్లా 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. పీయూష్ చావ్లా భారత్ తరఫున మూడు టెస్టు మ్యాచ్‌లు, 25 వన్డే మ్యాచ్‌లు, ఏడు టీ20లు ఆడాడు. వన్డేల్లో 4/23 అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువగా అవకాశాలు దక్కనప్పటికీ దేశవాళీలు, ఫ్రాంఛైజీ క్రికెట్‌లో పీయూష్ చావ్లా తనదైన ముద్ర వేశాడు. ఇప్పటివరకు 446 ఫస్ట్ క్లాస్ వికెట్లు, 319 టీ20 వికెట్ల తన ఖాతలో వేసుకున్నాడు. అతడు దేశవాళీల్లో ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో పలు టీమ్‌ల తరఫున ఆడాడు. 2012, 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ కప్ గెలిచింది. అప్పుడు కోల్‌కతా జట్టులో పీయూష్ చావ్లా సభ్యుడిగా ఉన్నాడు.