Last Updated:

IND vs NZ: భారత్‌తో న్యూజిలాండ్ టీ20, వన్డే సిరీస్‌లు.. జట్టులో కీలక మార్పులు

భారత్‌తో జరిగే టీ20, వన్డే సిరీస్‌లకు న్యూజిలాండ్ క్రికెట్ జట్టును ప్రకటించింది. కివీస్ పర్యటనలో భాగంగా ఈ నెల 18 నుంచి 30 వరకు భారత్ న్యూజిలాండ్ టీంతో మూడు టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది. భారత్‌తో ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్ తమ జట్టులో కీలక మార్పులు చేసింది. టీమిండియాపై మంచి రికార్డు ఉన్న ఇద్దరు కీలక ఆటగాళ్లను కివీస్ సెలెక్టర్లు పక్కన బెట్టారు.

IND vs NZ: భారత్‌తో న్యూజిలాండ్ టీ20, వన్డే సిరీస్‌లు.. జట్టులో కీలక మార్పులు

IND vs NZ: భారత్‌తో జరిగే టీ20, వన్డే సిరీస్‌లకు న్యూజిలాండ్ క్రికెట్ జట్టును ప్రకటించింది. కివీస్ పర్యటనలో భాగంగా ఈ నెల 18 నుంచి 30 వరకు భారత్ న్యూజిలాండ్ టీంతో మూడు టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది. భారత్‌తో ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్ తమ జట్టులో కీలక మార్పులు చేసింది. టీమిండియాపై మంచి రికార్డు ఉన్న ఇద్దరు కీలక ఆటగాళ్లను కివీస్ సెలెక్టర్లు పక్కన బెట్టారు.

టీమింయా టీ20, వన్డే సిరీస్‌లకు కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌, ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ ను ఈ సిరీస్‌ నుంచి తప్పించారు. మార్టిన్ గప్టిల్ స్థానంలో ఫిన్ అలెన్ ఇప్పుడు న్యూజిలాండ్ వన్డే, టీ20 జట్టులో ఓపెనర్‌గా, బౌల్ట్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నే జట్టులోకి ఎంపిక చేశారు. కైల్ జేమీసన్ గాయం కారణంగా తప్పుకున్నాడు. టీమిండియాలో చాలా మంది ప్రపంచస్థాయి క్రికెటర్లు ఉన్నారని ఈసారి తన టీమ్‌తో పోరు చాలా రసవత్తరంగా జరగనుందని ప్రధాన కోచ్ గ్యారీ స్టెడ్ అన్నారు.

భారత్‌తో టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు:

కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), ల్యూక్ ఫెర్గూసన్, డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌతీ, ఇష్ సోధి, బ్లెయిర్ టిక్నర్.

న్యూజిలాండ్ వన్డే జట్టు:

కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), డెవాన్ కాన్వే, ల్యూక్ ఫెర్గూసన్, డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌతీ, మాట్ హెన్రీ.

ఇదీ చదవండి: విడాకుల వివాదం.. “మీర్జా మాలిక్” ట్విస్ట్

ఇవి కూడా చదవండి: