Published On:

IPL 2025 25th Match: నరైన్ ఆల్‌రౌండర్ షో.. కోల్‌కతా చేతిలో చెన్నై ఘోర ఓటమి!

IPL 2025 25th Match: నరైన్ ఆల్‌రౌండర్ షో.. కోల్‌కతా చేతిలో చెన్నై ఘోర ఓటమి!

Kolkata Knight Riders won by 8 wickets against Chennai Super Kings: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్‌లో 26వ మ్యాచ్ జరిగింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై చిత్తుగా ఓడింది. ఈ సీజన్‌లో చెన్నైకి ఇది వరుసగా ఐదో పరాజయం.

 

తొలుత బ్యాటింగ్ చేపట్టిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు డేవాన్ కాన్వే(12), రచిన్ రవీంద్ర(4) వెంట వెంటనే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విజయ్ శంకర్(29), శివమ్ దూబె(31), అశ్విన్(1), జడేజా(0), దీపక్ హుడా(0), ధోని(1), నూర్ అహ్మద్(1), అన్షుల్(3) పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ 3 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా, వరున్ చక్రవర్తి చెరో 2 వికెట్లు, మొయిన్ అలీ ఒక వికెట్ తీశాడు.

 

104 పరుగులను కోల్‌కతా నైట్ రైడర్స్ 10.1 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు డికాక్(23), సునీల్ నరైన్(44) సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకుపడ్డారు.అన్షుల్ బౌలింగ్‌లో డికాక్ ఔట్ అవ్వగా.. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో నరైన్ పెవిలియన్ చేరాడు. తర్వాతల రహానె(20), రింకు సింగ్(15) పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్, అన్షుల్ చెరో వికెట్ తీశారు.