PM Modi visits Canada: విదేశీ పర్యటనకు ప్రధాని.. కెనడాలో జీ7 సదస్సుకు హాజరు!
PM Modi Visits Canada for G7 Summit: ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు బయల్దేరారు. సైప్రస్, కెనడా, క్రొయేషియా దేశాల్లో పర్యటించనున్నారు. అలాగే రెండు రోజులపాటు సైప్రస్ లో పర్యటించనున్నారు. రేపటి నుంచి కెనడా వేదికగా మూడు రోజులపాటు జరిగే జీ7 సమ్మిట్ కు ప్రధాని మోదీ హాజరుకానున్నారు.
కెనడా పర్యటన అనంతరం ఈనెల 18న ప్రధాని క్రొయేషియాకు వెళ్లనున్నారు. అయితే కొంతకాలంగా భారత్- కెనడా మధ్య సంబంధాలు సన్నగిల్లిన నేపథ్యంలో ప్రధాని మోదీ కెనడాకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించకుంది. మరోవైపు ప్రధాని పర్యటనతో ఇరు దేశాల మధ్య నెలకొన్న బేదాభిప్రాయాలు సమసిపోయే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రధాని విదేశీ పర్యటన నేపథ్యంలో ఆయా దేశాల అధినేతలతో వాణిజ్య, భాగస్వామ్య సంబంధాలపై చర్చించే అవకాశం ఉంది. అందుకు సంబంధించి ఒప్పందాలు కూడా చేసుకునే ఛాన్స్ ఉన్నట్టు సమచారం.