Published On:

IPL 2025: చెన్నైతో ఢిల్లీ మ్యాచ్.. ఇరు జట్లలో కీలక మార్పులివే?

IPL 2025: చెన్నైతో ఢిల్లీ మ్యాచ్.. ఇరు జట్లలో కీలక మార్పులివే?

Chennai Super Kings vs Delhi Capitals In IPL 2CSK025: ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ చెపాక్ వేదికగా 20వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ 2.30 నిమిషాలకు ప్రారంభమైంది. అయితే ఇరు జట్లలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

 

ఢిల్లీతో మ్యాచ్‌కు గాయం కారణంగా చెన్నై కెప్టెన్ రుతురాజ్ దూరమంటూ వచ్చిన వార్తలు చెక్ పెట్టారు. నా మోచేయి బాగానే ఉందని రుతురాజ్ గైక్వాడ్ ప్రకటించారు. అయితే రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నామన్నారు. ఓవర్టన్ బదులుగా దేవన్ కాన్వే, త్రిపాఠి స్థానంలో ముకేశ్ ఆడుతున్నట్లు వెల్లడించారు. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్‌లో కూడా మార్పులు జరిగాయి. ఫాఫ్ డుప్లెసిస్ ఫిట్‌గ లేడని కెప్టెన్ అక్షర్ పటేల తెలిపారు. ఈ మేరకు సమీర రిజ్వీకి అవకాశం ఇచ్చినట్లు వెల్లడించారు.

తుది జట్లు ఇవే..

చెన్నై: రచిన్ రవీంద్ర, డేవన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అహ్మద్, ముకేశ్, ఖలీల్ అహ్మద్, పతిరన.

ఢిల్లీ: జేక్ ఫ్రేజర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్), ఆశుతోష్ శర్మ, విఫ్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్ దీప్ యాదవ్, మోహిత్ శర్మ.