Electric Bus: కరీంనగర్ లో ఎలక్ట్రిక్ బస్సు నుంచి మంటలు

Fire In RTC Bus: కరీంనగర్ లో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు నుంచి మంటలు వ్యాపించాయి. దీంతో ఆందోళనకు గురైన ఆర్టీసీ సిబ్బంది వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిక ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం కరీంనగర్ ఆర్టీసీ డిపో2 ఎలక్ట్రిక్ బస్సు ఉదయం 5.30 గంటలకు కరీంనగర్ నుంచి జేబీఎస్ వెళ్లాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో బస్టాండ్ లో పాయింట్ మీదకు తీసుకెళ్లేందుకు డ్రైవర్ రెడీ అవుతుండగా.. బస్సు కింద ఉండే బ్యాటరీల నుంచి మంటలు వచ్చాయి. వెంటనే విషయం గమనించిన డ్రైవర్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో డిపో వద్దకు చేరుకున్న అధికారులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారొచ్చి మంటలను అదుపుచేశారు. సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని.. బస్సు పూర్తిగా కాలిపోలేదని అధికారులు చెప్పారు.