Last Updated:

Adipurush Movie Review : ప్రభాస్ “ఆదిపురుష్” సినిమా రివ్యూ.. యునానిమస్ గా “జై శ్రీరామ్” కి జై

Adipurush Movie Review : ప్రభాస్ “ఆదిపురుష్” సినిమా రివ్యూ.. యునానిమస్ గా “జై శ్రీరామ్” కి జై

Cast & Crew

  • ప్రభాస్ (Hero)
  • కృతి సనన్ (Heroine)
  • సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, దేవదత్త, సోనాల్ చౌహన్ తదితరులు (Cast)
  • ఓం రౌత్ (Director)
  • భూషణ్ కుమార్, కృష్ణకుమార్, ఓం రౌత్, వంశీ, ప్రమోద్, రాజేష్ నాయర్, ప్రసాద్ సుతార్ (Producer)
  • నేపథ్య సంగీతం : సంచిత్ - అంకిత్, స్వరాలు : అజయ్ - అతుల్, సచేత్ - పరంపర (Music)
  • కార్తీక్ పళని (Cinematography)
2.7

Adipurush Movie Review : ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో రాబోతున్న “ఆదిపురుష్” కూడా ఒకటి. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా చేస్తున్నారు. కాగా బాలీవుడ్ భామ కృతి సనన్ సీతగా.. ప్రముఖ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు.  సుమారు 500కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీని టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మరి ఈ తరుణంలో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఆధునిక రామాయణం ఎలా ఉందో తెలుసుకుందాం. విజువల్ వండర్ గా వచ్చిన “ఆదిపురుష్” చిత్రం రివ్యూ, రేటింగ్ మీకోసం ప్రత్యేకంగా..

సినిమా కథ.. 

రామాయణం గురించి ప్రత్యేకంగా కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మన పురాణాల ఆధారంగా ఇప్పటికే పలు భాషల్లో రామాయణం గురించి సినిమాలు వచ్చాయి.. అలానే పలు గ్రంధాల ద్వారా చిన్నప్పటికి నుంచి రామాయణం గురించి చదువుతూనే ఉంటున్నాం. కాగా ఈ “ఆదిపురుష్” చిత్రాన్ని వాల్మీకి ర‌చించిన రామాయ‌ణంలోని కొన్ని ప్ర‌ధాన ఘ‌ట్టాల ఆధారంగా తెరకెక్కించారు. ప్రధానంగా రాముడు వనవాసం చేయడం దగ్గర నుంచి ఈ కథ ప్రారంభం అవుతుంది. రాఘ‌వ (ప్ర‌భాస్‌) వ‌న‌వాసం స్వీక‌రించి జాన‌కి (కృతిస‌న‌న్‌), సోద‌రుడు శేషు (స‌న్నీసింగ్‌)తో క‌లిసి స‌త్యం, ధ‌ర్మ‌మే త‌న ఆయుధంగా వ‌న‌వాసం గ‌డుపుతుంటాడు. రాఘవ మోహన రూపం చూసిన శూర్పణఖ అతనితో మోహంతో తన భర్తగా ఆహ్వానిస్తుంది. కానీ అందుకు ‘నేను వివాహితుడిని. క్షమించండి’ అని రాఘవుడు తప్పుకుంటాడు. ఆ తర్వాత శేషు వేసిన బాణం సూర్పణఖ  ముక్కుకు తగులుతుంది. అవమానంతో లంకకు వెళ్లిన సూర్పణఖ.. అన్నయ్య లంకేశుడి (సైఫ్ అలీ ఖాన్) దగ్గర మొరపెట్టుకుంటుంది. జానకిపై మోహావేశంతోనూ  సాధువు వేషధారణలో వెళ్లిన లంకేశుడు.. జానకిని అపహరించి లంకకు తీసుకొస్తాడు. ఇక రాఘవ .. హనుమ, వానర సైన్యం సహాయంతో ..లంకపై దండెత్తి యుద్ధం చేయడం.. కానీ లంకేష్ కు బ్రహ్మ ఇచ్చిన ఓ వరం అండగా ఉండడం.. చివరికి ఆ పోరాటంలో చెడుపై మంచి ఎలా గెలిచింద‌న్న‌ది మిగ‌తా క‌థ‌.

adipurush

మూవీ రివ్యూ..

ఇక తెలిసిన కథే అయినప్పటికీ ఈ తరం ప్రేక్షకులు మెచ్చేలా కొంతమేర మార్పులు చేశారు. ముఖ్యంగా వేషధారణ, విజువల్స్ లో తీసుకొచ్చిన మార్పులు నేటి తరానికి నచ్చేలా ఉన్నాయి. కానీ కొంతమంది మాత్రం ఈ వీటిపై పెదవి విరుస్తున్నారు. క‌ట్టిప‌డేసేలా విజువ‌ల్స్‌, అబ్బుర ప‌రిచేలా గ్రాఫిక్స్ హంగులుతో.. రామాయ‌ణంలోని కొన్ని కీల‌క ఘ‌ట్టాల ఆధారంగా ఈ సినిమాని తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు ఓం రౌత్‌. ఈ క్ర‌మంలో రామాయ‌ణ ఇతిహాసంలోని ప్రామాణిక‌త‌ని ప‌క్క‌నపెట్టి.. సంద‌ర్భాలు, పాత్ర‌ల్ని సినిమాకి అనుకూలంగా మార్చుకున్నారు. లంకేశ్ దీక్ష‌ని మెచ్చి బ్ర‌హ్మ ప్ర‌త్య‌క్ష‌మై వ‌రాలు ఇవ్వ‌డంతో అస‌లు క‌థ‌లోకి వెళుతుంది సినిమా. అక్క‌డి నుంచి అంద‌రికీ తెలిసిన రామాయ‌ణంలోని ప్ర‌ధాన ఘ‌ట్టాలే ఒక్కొక్కటిగా తెర‌పైకి వ‌స్తుంటాయి.

బంగారు లేడీ మాయ, సీతాప‌హ‌ర‌ణం, వాలి-సుగ్రీవుల యుద్ధం, హ‌నుమంతుడి సాయం, లంకాద‌హ‌నం, వాన‌ర సైన్యంతో క‌లిసి సేతు నిర్మాణం, ల‌క్ష్మ‌ణుడి ప్రాణాల్ని కాపాడటం కోసం హ‌నుమంతుడు సంజీవ‌ని ప‌ర్వ‌తాన్ని తీసుకురావ‌డం, రామ‌రావ‌ణ యుద్ధం..ఇలా వ‌రుస ఘ‌ట్టాల‌తో సినిమా సాగుతుంది. క‌థ కంటే కూడా ఎక్కువ విజువ‌ల్స్‌తో ప్రేక్ష‌కుల్ని క‌ట్టిప‌డేశాడు ద‌ర్శ‌కుడు. లంక‌ని తెర‌పై ఆవిష్క‌రించిన విధానం సినిమాకే హైలైట్‌ అని చెప్పాలి. విజువ‌ల్స్‌పై ఎక్కువ‌గా దృష్టి పెట్టడం ఒకే కానీ.. భావోద్వేగాల్ని మాత్రం లైట్ తీసుకున్నారు.

జాన‌కి, రాఘ‌వ మ‌ధ్య ఎడ‌బాటు.. హ‌నుమంతుడి విన్యాసాలు, శ్రీరాముడి విలువ‌లు, ఆయ‌న ప‌రాక్ర‌మం త‌దిత‌ర నేప‌థ్యాల్ని వాడుకుని బ‌ల‌మైన భావోద్వేగాల్ని పండించే ఆస్కారం ఉన్నా ద‌ర్శ‌కుడు ఆ విష‌యంలో పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌లేక‌పోయారు. సేతు నిర్మాణానికి వానర‌సైన్యాన్ని సిద్ధం చేయ‌డం, లంక‌లో రావ‌ణుడిపై పోరాటం కోసం సైన్యంలో స్ఫూర్తిని నింపే ఘ‌ట్టాలు మిన‌హా ఏవీ హీరోయిజాన్ని హైలైట్‌ చేయ‌లేక‌పోయాయి. పాత్ర‌ల్ని తీర్చిదిద్దిన విధానం మాత్రం మెప్పిస్తుంది. క‌థ‌, క‌థ‌నాల కంటే కూడా.. అంచ‌నాల‌కి త‌గ్గ‌ట్టుగా న‌వ‌త‌రం ప్రేక్ష‌కులు, చిన్నారుల్ని అల‌రించే విజువ‌ల్స్‌తో రూపొందిన చిత్రంగా ఆదిపురుష్ ని చెప్పవచ్చు.

Adipurush

ఎవ‌రెలా చేశారంటే.. 

రాఘ‌వ పాత్ర‌లో ప్ర‌భాస్ ఒదిగిపోయారు. శ్రీరాముడిలోని సాత్విక‌త‌, ప్ర‌శాంత‌త త‌న ముఖంలోనూ క‌నిపించేలా చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు. జాన‌కి పాత్ర‌కి తెర‌పైన ఎక్కువ‌గా ప్రాధాన్యం ద‌క్క‌క పోయినప్పటికి.. ఉన్నంత సేపు చాలా హుందాగా, అందంగా క‌నిపించారు. రాముడికి త‌గ్గ సీత అనిపించుకున్నారు. లంకేశ్‌గా రావ‌ణుడి పాత్ర‌లో సైఫ్ అలీఖాన్ మంచి అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు. ఆయ‌న గెట‌ప్ మాత్రం మ‌రీ ఆధునికంగా క‌నిపిస్తుంది. ప‌తాక స‌న్నివేశాల్లో సైఫ్ అలీఖాన్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. ల‌క్ష్మ‌ణుడిగా స‌న్నీసింగ్‌, హ‌నుమంతుడిగా దేవ్‌ద‌త్ చక్కగా నటించారు. మిగిలిన పాత్ర‌ల‌కి పెద్ద‌గా ప్రాధాన్యం లేదు. ఇక సాంకేతికత విషయానికి వస్తే విజువ‌ల్ ట్రీట్ అని చెప్పొచ్చు. కెమెరా, విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్ విభాగాల అత్యుత్త‌మ ప‌నితీరు క‌నిపిస్తుంది. సంగీతం సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. జై శ్రీరామ్‌, శివోహం, ప్రియ‌మిథునం పాట‌లు, చిత్రీక‌ర‌ణ సినిమాకి ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. అజ‌య్ – అతుల్‌ స‌మ‌కూర్చిన బాణీలు ఎంత బాగున్నాయో, సంచిత్, అంకిత్ ద్వ‌యం నేప‌థ్య సంగీతంతో అంత‌గా క‌ట్టిప‌డేసింది. భార‌తీయ ఇతిహాస రామాయ‌ణాన్ని క‌మ‌ర్షియ‌ల్‌గా, ప్రస్తుత తరానికి నచ్చేలా తెర‌పైకి తీసుకు రావ‌డంలో విజ‌య‌వంత‌మ‌య్యారు.

కంక్లూజన్.. మోడరన్ రామాయణం..

ఇవి కూడా చదవండి: