Last Updated:

Sir Movie Review : గట్టిగా క్లాస్ పీకిన ధనుష్ “సార్”.. సినిమా రివ్యూ, రేటింగ్ !

Sir Movie Review : గట్టిగా క్లాస్ పీకిన ధనుష్ “సార్”.. సినిమా రివ్యూ, రేటింగ్ !

Cast & Crew

  • ధనుష్ (Hero)
  • సంయుక్త (Heroine)
  • హైపర్ ఆది, తనికెళ్ల భరణి, సముద్రఖని, సుమంత్ తదితరులు (Cast)
  • వెంకీ అట్లూరి (Director)
  • సాయి సౌజన్య, సూర్యదేవర నాగ వంశీ (Producer)
  • జీవీ ప్రకాష్ కుమార్ (Music)
  • యువరాజ్ (Cinematography)
3

Sir Movie Review : తమిళ స్టార్ హీరో ధనుష్.. తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేసిన సినిమా “సార్”.  శ్రీకర స్టూడియోస్ నిర్మాణంలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై ఈ మూవీ తెరకెక్కింది. సంయుక్త ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించగా.. మొదటిసారి ధనుష్ డైరెక్ట్ తెలుగు సినిమా చేశాడు. సార్ సినిమాని తెలుగు, తమిళ్ లో బైలింగ్వల్ గా తెరకెక్కించారు. ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ అయినప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మంచి అంచనాల నడుమ వచ్చిన  ఈ సినిమా ఎలా ఉంది.. అంచనాలు అందుకుందా..? లేదా ?? మీకోసం ప్రత్యేకంగా..

సినిమా కథ..

ఈ చిత్రం కథంతా 1998-2000 కాలంలో సాగుతుంది. ఓ కుర్రాడికి కనిపించిన ఓ పాత వీడియో టేప్ ఆధారంగా ఒక కలెక్టర్ (హీరో సుమంత్) కలవగా.. అతను అసలు జరిగిన కథని వివరిస్తాడు. ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తే.. బాలు అలియాస్ బాలగంగాధర్ తిలక్ (ధనుష్) ఓ డ్రైవర్ కొడుకు. త్రిపాఠి (సముద్రఖని) ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో జూనియర్ లెక్చరర్ గా పనిచేస్తూ ఉంటాడు. కొన్ని పరిస్థితుల కారణంగా సిరిపురంలోని గవర్నమెంట్ జూనియర్ కళాశాలకు లెక్చరర్ గా బాలు వెళ్లాల్సి వస్తుంది. అదే కాలేజీలో పని చేస్తున్న మీనాక్షి (సంయుక్త మీనన్)ను తొలి చూపులోనే చూసి ఇష్టపడతాడు బాలు.

ఇదిలా ఉంటే ఆ గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్న స్టూడెంట్స్ అందరూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారు. దాంతో త్రిపాఠి ఈ కాలేజ్ వల్ల తన ఎడ్యుకేషనల్ బిజినెస్ పాడవుతుందని ఆ ఊరి పిల్లల్ని కూడా చదువుకోనీకుండా అడ్డు పడతాడు. ప్రైవేట్ కాలేజీల అసోసియేషన్ అధ్యక్షుడైన త్రిపాఠి (సముద్రఖని) ఏం చేశాడు? బాలు ఎన్ని అడ్డంకులు ఎదుర్కోవాల్సి వచ్చింది? అతని ప్రయాణంలో మీనాక్షి (సంయుక్తా మీనన్) పాత్ర ఏమిటి? అదే సమయంలో త్రిపాఠితో బాలు ఒక సవాల్ చేస్తాడు.. అదేంటి ఆ ఊరి పిల్లలందరూ చదువుకొని ప్రయోజకులయ్యారా లేదా.. అసలు ఆ ఊరి కోసం సార్ ఏం చేశాడు అనేది మిగిలిన కథ..

మూవీ విశ్లేషణ..

‘విద్య అనేది గుడిలో పెట్టిన నైవేద్యం లాంటిది..పంచండి. అంతేకానీ ఫైవ్‌స్టార్‌ హోటల్లో డిష్‌లా అమ్మకండి’ అవసరం అయిన చోటు ‘అవసరానికి కులం ఉండదు’, ఇలాంటి డైలాగ్స్ చాలు సినిమాలో ఏం మెసేజ్ ఇస్తున్నారో అర్దం చేసుకోవడానికి. విద్యను వ్యాపారం చేస్తున్న ఎంతో మందికి ఈ సినిమా చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెబుతుంది అనడంలో సందేహం లేదు. కథగా చెప్పుకోవడానికి కొత్తగా లేకపోయినా.. చెప్పిన విధానం మాత్రం గుండెలకు హత్తుకునేలా వెంకీ అట్లూరి మ్యాజిక్ చేసేశాడు. సాధారణ సన్నివేశానికి కూడా బలమైన మాటలు, అదిరిపోయే నేపథ్య సంగీతంతో సీన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. ముఖ్యంగా చదువును మార్కెట్లో వ్యాపారంగా ఎలా మార్చారు అనే విషయాన్ని అద్భుతంగా స్క్రీన్ మీద చూపించాడు వెంకీ అట్లూరి.

ఈ విషయంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడు. గవర్నమెంట్ కాలేజీలను ప్రభుత్వం కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు.. ప్రైవేట్ సెక్టార్లో పడి చదువు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎలా దూరమైపోతుంది అనేది ఈ సినిమాలో చక్కగా చూపించారు. ఎక్కడ కమర్షియల్ హక్కులకు పోకుండా హానెస్ట్ గా మంచి అటెంప్ట్ చేశాడు వెంకీ. ఇంటర్వెల్ వరకు మామయాఉలుగా ఉన్న ఈ మూవీ.. ఇంటర్వెల్ తర్వాత ప్రేక్షకులు అందరికీ హార్ట్ టచింగ్ ఫీల్ ఖచ్చితంగా ఇస్తుంది. క్లైమాక్స్ కూడా ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతుంది. ఓవరాల్ గా చదువుకోవాలి.. కానీ చదువు కొనకూడదు అనే మాటని చక్కగా చెప్పారు.

నటీనటులు ఎలా చేశారంటే..

ఏ పాత్రలోకి అయిన అపరకాయ ప్రవేశం చేసి 100% న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తాడు ధనుష్. ఈ సినిమాలో కూడా మరోసారి అద్భుతంగా నటించాడు. ఆయన నటన సినిమాను మరో మెట్టు పైకి ఎక్కించింది. సంయుక్త కూడా పాత్ర పరిధి మేరకు బాగా నటించింది. సముద్రఖని, హైపర్ ఆది, తనికెళ్ల భరణి, సాయి కుమార్ లాంటి వాళ్ళు పాత్రలకు తగినట్టు మెప్పించారు.

ఇక ఈ  సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా ప్లస్ అయింది. దానికి తోడు మాస్టారు మాస్టారు సాంగ్ విజువల్ గా కూడా అద్భుతంగా ఉంది. యువరాజ్ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో అడ్వాంటేజ్. నవీన్ నులి ఎడిటింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. చిత్ర నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడిగా వెంకి అట్లూరి చెప్పాలనుకున్న పాయింట్ని హానెస్ట్ గా చెప్పాడు. డైలాగులు కూడా చాలా చక్కగా రాశారు.

కంక్లూజన్..

అందరికీ గట్టి క్లాస్ ఇచ్చిన సార్.. మస్ట్ వాచ్.. “విద్యని వ్యాపారం చేసిన, చేస్తున్న, చేయాలి అనుకునే వాళ్ళకి ఒక “చెప్పు దెబ్బ”

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

ఇవి కూడా చదవండి: