Last Updated:

Jaabilamma Neeku Antha Kopama OTT: సర్‌ప్రైజ్‌.. సడెన్‌గా ఓటీటీకి వచ్చేసిన ధనుష్‌ సినిమా!

Jaabilamma Neeku Antha Kopama OTT: సర్‌ప్రైజ్‌.. సడెన్‌గా ఓటీటీకి వచ్చేసిన ధనుష్‌ సినిమా!

Jabilamma Neeku Antha Kopama Now Streaming on OTT: యువ నటీనటులతో స్టార్‌ హీరో ధనుష్‌ దర్శకత్వం వహించిన లేటెస్ట్‌ యూత్‌పుల్‌ లవ్‌, రొమాంటిక్‌ చిత్రం నిలవకు ‘ఎల్‌ మెల్‌ ఎన్నాడి కోబం’ (తెలుగలో జాబిలమ్మ నీకు అంత కోపమా). తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 21న థియేటర్‌లో విడుదలైంది. ఈ సినిమాలో గోల్డెన్‌ స్పారో సాంగ్‌ ఎంతటి సంచలనం సృష్టించింది తెలిసిందే. దీంతో మూవీ మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యింది.

పైగా ధనుష్‌ దర్శకత్వం నుంచి వస్తున్న చిత్రంపై అంచనాల భారీగా నెలకొన్నాయి. విడుదల తర్వాత ఈ చిత్రం పర్వాలేదు అనిపించింది. థియేటర్లలో యూత్‌ని బాగా అలరించిన ఈ సినిమా సడెన్‌గా ఓటీటీలో ప్రత్యక్షమైంది. రిలీజైన నెల రోజులకు ఈ సినిమా తమిళ వెర్షన్‌లో అమెజాన్‌ ప్రైంలో అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా తెలుగు వెర్షన్‌ కూడా ఓటీటీకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన, అప్‌డేట్‌ లేకుండానే సైలెంట్‌గా తెలుగులో అందుబాటులోకి వచ్చింది.

అమెజాన్‌ ప్రైం ఈ సినిమా స్ట్రీమింగ్‌ తీసుకువచ్చి సర్‌ప్రైజ్‌ చేసింది. దీంతో మూవీ లవర్స్‌ అంతా షాక్‌ అవుతున్నారు. కాగా అనిఖా సురేందర్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, పవీష్‌, మాథ్యూ థామస్‌, రబియా ఖతూన్‌, రమ్యా రంగనాథన్‌, వెంకటేష్‌ మీనన్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను కస్తూరి రాజా, విజయలక్ష్మి కస్తూరి రాజా సమర్పణలో ఆర్.కె ప్రొడక్షన్‌, వండర్ బాల్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. జీవీ ప్రకాష్‌ సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి: