Published On:

Director SS Stanley Death News: సినీ పరిశ్రమలో విషాదం.. ధనుష్ మూవీ డైరెక్టర్ స్టాన్లీ కన్నుమూత

Director SS Stanley Death News: సినీ పరిశ్రమలో విషాదం.. ధనుష్ మూవీ డైరెక్టర్ స్టాన్లీ కన్నుమూత

Dhanush Movie Director SS Stanley Passed away: సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు, యాక్టర్ ఎస్ఎస్ స్టాన్లీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

 

తమిళ పరిశ్రమలో ప్రముఖ దర్శకులలలో ఒకరుగా స్టాన్లీ గుర్తింపు పొందారు. శ్రీకాంత్ నటించిన ఏప్రిల్ మంత్ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ధనుష్‌తో పుదుకోట్టూయిల్ శరవణన్ సినిమాకు దర్శకత్వం వహించారు. అలాగే ఈస్ట్ కోస్ట్ రోడ్ సినిమాను చేశారు. అంతేకాకుండా ఆయన తమిళంలోని పలు సినిమాల్లో నటించారు. విజయ్ సేతుపతి నటించిన మహారాజా సినిమాలో ఆయన చివరిసారిగా కనిపించారు.