Dhanush: గొప్ప యుద్దం ప్రాంభం కాబోతోంది – ఇంట్రెస్టింగ్ పోస్టర్‌తో సర్‌ప్రైజ్ చేసిన ధనుష్

Dhanush Announces New Project With Mari Selvaraj: తమిళ స్టార్ హీరో ధనుష్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. హీరోగానే కాదు దర్శకుడిగా వరుస సినిమాలు చిత్రీకరిస్తున్నాడు. ప్రస్తుతం ధనుష్ స్వీయ దర్శకత్వంలో ఇడ్లీ కడై అనే సినిమా రూపొందుతుంది. అలాగే తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కుబేర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇవి ఇంకా సెట్స్‌పై ఉండగానే.. ధనుష్ తన తదుపరి సినిమా ప్రకటించాడు.
డైరెక్టర్ మారి సెల్వరాజ్ దర్శకత్వంలో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. తాజాగా ఈ సినిమా అధికారిక ప్రకటన ఇచ్చాడు. ధనుష్ 56వ సినిమా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాను ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. “రూట్ బిగైన్స్.. ఒక గొప్ప యుద్దం ప్రారంభించబోతున్నాం” అనే క్యాప్షన్ జోడించాడు. ఇక ఈ పోస్టర్‌లో పుర్రేకు పెద్ద కత్తిని గుచ్చినట్టు చూపించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్టర్ ఆసక్తిని పెంచుతోంది. వర్కింగ్ టైటిల్‌తో ప్రకటించినప్పటికి ఈ పోస్ట్‌కి ఇచ్చిన క్యాప్షన్ ఆడియన్స్‌లో క్యూరియాసిటి పెంచుతుంది. ఇది భారీ యాక్షన్ ఫిలిం అని తెలుస్తోంది.
#D56 Roots begin a Great War
A @mari_selvaraj film pic.twitter.com/3yfhd6B2pZ— Dhanush (@dhanushkraja) April 9, 2025
పీరియాడికల్ యాక్షన్ చిత్రమా? లేక యాక్షన్, థ్రిల్లర్ అంటూ అంతా సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ధనుష్-మారి సెల్వరాజ్‌లది హిట్ కాంబినేషన్ అనే విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబో ‘కర్ణన్’ అనే సినిమా తెరకెక్కింది. పీరియాడికల్ యాక్షన్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2021లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరు కాంబోలో మరో సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఇషారి కే. గణేష్ నిర్మించబోతున్నారు.