Daggubati Purandeswari: దగ్గుబాటి పురందేశ్వరికి బీజేపీ హైకమాండ్ షాక్
బీజేపీ జాతీయప్రధానకార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరికి బీజేపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. గత నెలలో ఒరిస్సా బాధ్యతల నుంచి తప్పించగా నిన్న ఛత్తీస్ ఘడ్ బిజేపి ఇంచార్జ్ బాధ్యతల నుంచి పురందేశ్వరిని తప్పించింది.
New Delhi: బీజేపీ జాతీయప్రధానకార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరికి బీజేపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. గత నెలలో ఒరిస్సా బాధ్యతల నుంచి తప్పించగా నిన్న ఛత్తీస్ ఘడ్ బిజేపి ఇంచార్జ్ బాధ్యతల నుంచి పురందేశ్వరిని తప్పించింది. పురందేశ్వరి 2020 నవంబర్ నుంచి చత్తీస్ గఢ్, ఒడిశా బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జిగా ఉన్నారు. పురందేశ్వరి స్దానంలో రాజస్దాన్ కు చెందిన ఓం మాధుర్ ను ఛత్తీస్ గఢ్ వ్యవహారాల ఇన్ చార్జ్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పురందేశ్వరి అధ్యక్షతన “ఏపిలో విస్తృత చేరికల కమిటీ” ఏర్పాటు చేసినా ఏమాత్రం ఫలితం లేదని బీజేపీ అగ్రనాయకత్వం భావించింది. పురందేశ్వరికి బిజేపిలో మంచి గౌరవం ఇచ్చినా, చేరికల విషయంలో ఏమాత్రం ప్రయత్నాలు చేయలేదని కేంద్రనాయకత్వం అసంతృప్తి చెందినట్లు సమాచారం. ఓం మాధుర్ గతంలో గుజరాత్ ఇన్ చార్జ్ గా. గత ఏడాది యూపీ ఇన్ చార్జ్ గా పనిచేసారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపులో కీలకపాత్ర పోషించారు.