Last Updated:

Water Crisis in Sangli: మహారాష్ట్రలోని సాంగ్లీలో తీవ్ర నీటి ఎద్దడి

లోక్ సభ మూడవ విడత పోలింగ్‌కు గడువు దగ్గరపడుతోంది. ఓటర్లు రాజకీయ నాయకులను తమ సమస్యలను తీరిస్తేనే ఓట్లు వేస్తామని బెట్టు చేస్తున్నారు. ఇక తాజా ఉదంతం విషయానికి వస్తే మహారాష్ర్టలోని సాంగ్లీ జిల్లాను తీసుకుంటే ఇక్కడ పలు తాలూకాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది.

Water Crisis in Sangli: మహారాష్ట్రలోని సాంగ్లీలో తీవ్ర నీటి  ఎద్దడి

Water Crisis in Sangli:లోక్ సభ మూడవ విడత పోలింగ్‌కు గడువు దగ్గరపడుతోంది. ఓటర్లు రాజకీయ నాయకులను తమ సమస్యలను తీరిస్తేనే ఓట్లు వేస్తామని బెట్టు చేస్తున్నారు. ఇక తాజా ఉదంతం విషయానికి వస్తే మహారాష్ర్టలోని సాంగ్లీ జిల్లాను తీసుకుంటే ఇక్కడ పలు తాలూకాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. మే 7న ఇక్కడ మూడవ విడత పోలింగ్‌ జరుగనుంది. దీంతో ఇక్కడి ఓటర్లు ప్రధానంగా నీటి ఎద్దడి గురించి తమలో తాము చర్చించుకుంటున్నారు. జిల్లాలోని జాట్‌, కవ్తే, మహంకాల్‌, టాస్‌గావ్‌, విటా, అట్పాడి, ఖాన్‌పూర్‌ తాలూకాకు చెందిన ప్రజలు తాగు నీటితో పాటు సాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఎన్నికల సమీపిస్తున్న కొద్ది నీటి ఎద్దడి సమస్య ప్రధాన ఎజెండాగా మారిపోయింది. తమ నీటి సమస్యను తీర్చే వారికే తమ ఓటు అని వారు గట్టిగా చెబుతున్నారు.

ప్రధాన అంశంగా నీటి కొరత..(Water Crisis in Sangli)

ఈ లోకసభ ఎన్నికల్లో నీటి కొరత మహారాష్ర్ట లో ప్రధాన అంశంగా మారిపోయింది. నీటి కొరతకు ప్రధాన కారణం ఇక్కడ వర్షపాతం అతి తక్కువగా నమోదు కావడమే. ఇక్కడ ప్రజలు మంచినీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోంది. ఇక పంటలకు బావులతో పాటు కాలువలపై ఆధారపడుతుంటారు. కృష్ణా నది నుంచి నీరు ఈ కాలువల ద్వారా పారుతున్నా ఇప్పటికి నీటి సమస్య మాత్రం తగ్గడం లేదని టాస్‌గౌవ్‌కు చెందిన ప్రజలు చెబుతున్నారు. తమ నీటి సమస్యను పరిష్కరించే వారికి మాత్రమే తమ ఓటు వేస్తామని ఇక్కడి ప్రజలు స్పష్టం చేస్తున్నారు. వర్షపాతం తక్కువగా నమోదు కావడంతో జిల్లాలోని పలు తాలూకాల్లో ప్రజలు కరువుతో ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణా నది నుంచి కాలువల ద్వారా నీటి పారుదల కొనసాగుతున్న కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికి నీటి కొరత తీవ్రంగా ఉందని స్థానికులు చెబుతున్నారు.

సాంగ్లీతో పాటు సతారా జిల్లాలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉండటంతో జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. కాలువల చుట్టుపక్కల ఎవ్వరూ వెళ్లరాదని ఆదేశాలు జారీ చేసింది. నీటిచౌర్యం జోరుగా సాగుతున్నందున అధికారులు ఈ ఆదేశాలు జారీ చేశారు. వర్షపాతం తక్కువగా నమోదు కావడం వల్ల ఇక్కడి డ్యామ్‌లు, రిజర్వాయర్లలో నీటి మట్టం పెరగలేదని,ఏడు నెలల తర్వాత ఇక్కడి నదులు, కాలువలు ఎండిపోయాయని అధికారులు తెలిపారు. దీంతో ఇక్కడి ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారని అధికారులు వివరించారు. సాంగ్లీతో పాటు సతారా జిల్లాలో సుమారు 1,060 కుగ్రామాల్లో మంచి నీటి కొరత దారుణంగా ఉందన్నారు. దీంతో జిల్లా యంత్రాగం తక్షణమే ప్రతి జిల్లాకు 250 నాటి ట్యాంకర్లను పంపిస్తోంది. ఇక మూడవ విడత పోలింగ్‌ ఈ నెల 7న జరుగునుంది. దేశంలోని 12 రాష్ర్టాల్లో మొత్తం 94 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగునుంది. వాటిలో మహారాష్ర్ట కూడా ఉంది. మూడవ విడత పోలింగ్‌లో బారామతి, రాయిగఢ్‌‌, ఒస్మానాబాద్‌, లాతూర్‌ (ఎస్‌సీ) సోలాపూర్‌, (ఎస్‌సీ), మాథా, సాంగ్లీ, సతారా, రత్నగిరి, సిందూదుర్గ, కొల్హాపూర్‌, హట్కానంగల్‌ లోకసభ నియోజకవర్గాలకు పోలింగ్‌ జరుగనుంది.