Maharashtra: మహాయుతిలో లుకలుకలు.. ఏక్‌నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు!

Cracks in Maharashtra’s ruling Mahayuti alliance: మహారాష్ట్రలోని అధికార మహాయుతి కూటమిలో చీలికలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హోంమంత్రి మంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన 20 మంది ఎమ్మెల్యేలకు ఉన్న వై కేటగిరీ సెక్యూరిటీని ఉపసంహరించుకున్నట్లు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. బీజేపీ, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలకు భద్రతాను కూడా తగ్గించనున్నారు. అయితే, శిండే వర్గంతో పోలిస్తే ఆ సంఖ్య చాలా తక్కువ అని పార్టీ వర్గాలు తెలిపాయి.
వనరుల దుర్వినియోగాన్ని అరికట్టడానికే..
రాష్ట్ర వనరుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి సీఎం ఫడ్నవీస్ నేతృత్వంలోని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంత్రులు కాకపోయినా, ఎమ్మెల్యేలకు అదనపు ప్రయోజనంగా వై కేటగిరీ మంజూరు చేయడంతోనే తొలగింపులు జరిపినట్లు సమాచారం. 2022లో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి విడిపోవడంతో మహావికాస్ అఘాడి ప్రభుత్వం పతనానికి దారితీసింది. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు పటిష్ట భద్రతను మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.
వ్యూహాత్మక ఎత్తుగడగా..
ఇక ఈ నిర్ణయంతో ఏక్‌నాథ్ షిండే, బీజేపీ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. తాజా చర్యతో సీఎం ఫడ్నవీస్ తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి చేసిన వ్యూహాత్మక ఎత్తుగడగా బీజేపీ నేతలు భావిస్తున్నారు. దావోస్ పర్యటనకు ముందు సీఎం ఎన్‌సీపీకి చెందిన తత్కరే (శ్రీవర్ధన్)ను రాయ్‌గఢ్ సంరక్షక మంత్రిగా నియమించారు. దీంతో రాయ్‌గఢ్, నాసిక్‌లకు సంరక్షక మంత్రి పదవుల కోసం బీజేపీ, షిండే పార్టీల మధ్య ప్రారంభమైన ప్రతిష్టంభన ఇప్పటికీ పరిష్కారం కాలేదు.
శివసేన ఎంపీ విమర్శలు..
అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత కూటమిలో స్పష్టంగా విభేదాలు కనిపిస్తుండటంపై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్ర విమర్శలు గుప్పించింది. సీఎం పదవి రాకపోవడంతో షిండే అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. దీంతోపాటు ఫడ్నవీస్‌తో వేదిక పంచుకోవడానికి ఏక్‌నాథ్ షిండే దూరంగా ఉంటున్నట్లు ప్రియాంక పేర్కొన్నారు.